Andhra News: వీటితో జాగ్రత్త.. దోమలవే కాదు.. మీ ప్రాణాలు కూడా పోవచ్చు..! ఎందుకంటే?

ఇంట్లో దోమల బెడద ఎక్కువైందని.. చాలా మంది వాటిని తరిమికొట్టేందుకు, జెట్ లేదా ఆలౌట్ వంటికి వాడుతుంటారు. అయితే ఈ మధ్య కాలంలో కొత్తగా.. దోమలు బత్తులు కూడా అందుబాటులోకి వచ్చాయి. దీంతో చాలా మంది వీటిని వాడుతున్నారు. మీరు కూడా అలాంటి దోమల బత్తులను వాడుతున్నారా?.. అయితే మీరు కచ్చితంగా ఈ వార్త తెలుసుకోవాల్సిందే.

Andhra News: వీటితో జాగ్రత్త.. దోమలవే కాదు.. మీ ప్రాణాలు కూడా పోవచ్చు..! ఎందుకంటే?
Andhra News

Edited By: Anand T

Updated on: Nov 28, 2025 | 5:36 PM

విజయవాడలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ప్రముఖ బ్రాండ్‌కు చెందిన దోమల బత్తుల తయారీలో ప్రమాదకర రసాయన పదార్థాలు వాడుతున్నట్టు గుర్తించారు అధికారలు. విజయవాడలోని ఒక షాపులో తనిఖీలు చేసిన అధికారులు దోమల కోసం వాడే ఈ అగరబత్తులలో ప్రమాదకరమైన మేపర్‌ఫ్లూథ్రిన్ అనే పురుగుల మందును పెద్ద మొత్తంలో వాడుతున్నట్టు గుర్తించారు. ఈ పురుగుల మందు మనిషి ఆరోగ్యానికి తీవ్ర హానికరమని అధికారులు చెప్తున్నారు.

మేపర్‌ఫ్లూథ్రిన్ అనేది ఒక రసాయన పదార్థం.. దీన్ని దోమలు తరిమెందుకు వాడతారు. అయితే దీనిని అధికంగా పీల్చుకుంటే ఇది మనుషుల ప్రాణాలకే ప్రమాదమని అధికారులు చెబుతున్నారు. దీని వల్ల శ్వాసకోస సమస్యలు, చర్మవ్యాధులు , నాడీ సమస్యలు తలెత్తుతే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే ప్రజలు ఈ అగరబత్తిని వాడకూడదని అధికారులు చేబుతున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండి ఈ అగరబత్తిని వాడకం మానుకోవాలని సూచనలు చేస్తున్నారు.. దోమలు తరిమేందుకు సహజమైన పద్ధతులు వాడుకోవాలని చెప్తున్నారు. విజయవాడలో అధికారులు చేపట్టిన తనిఖీలలో ఈ ప్రమాదకరమైన అగరబత్తులపై విచారణ కొనసాగుతుంది.. ఈ రసాయనాల ప్రభావం పైన అధికారులు అవగాహన కల్పిస్తూ విక్రయదారుల పైన చర్యలు చేపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.