విజయవాడ, ఆగస్టు 06: విజయవాడలో ప్రమాదాలు పొంచివున్న కొండ ప్రాంతాలు ఏడెనిమిది ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో సుమారు 45 వేల కుటుంబాలు… రెండులక్షల ముప్పైవేలకు పైగా ప్రజలు జీవనం సాగిస్తున్నారు. వర్షాకాలంలో కొండ ప్రాంతాల్లో కొండచరియలు ఇళ్ల మీద పడి ఇళ్ళు ధ్వంసం అయిన సంఘటనలు గతంలో చాలానే ఉన్నాయి. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అటు రెవెన్యూ, ఇటు నగర పాలక సంస్థ అధికారులు కొద్దిసేపు హడావుడి చేయటంతప్ప… పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న దాఖలాలు లేవనే చెప్పాలి. కొండచరియలు విరిగి పడే అవకాశం ఉన్న ప్రాంతాలను ఒక సర్వేద్వారా గుర్తించి అక్కడ భద్రతా చర్యలు చేపట్టాలన్న ఆలోచన వారి దరిచేరకపోవటం శోచనీయం. కనీసం కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న చోట బలమైన ఐరన్ ఫెన్సింగ్ నిర్మించటం ద్వారా కొండు చరియలు ఇళ్ళమీద పడకుండా కొంతవరకు నిరోధించవచ్చునని ప్రతి సంవత్సరం అధికారులు మొక్కుబడి సమావేశాల్లో చర్చించుకోవటం తప్పు చేసింది ఏమీ లేదని నగర ప్రముఖులు..
ప్రతి ఏడాది వర్ష కాలంలో రాళ్ళ చుట్టూ గుల్లగా ఉన్న కొండ ప్రాంతం కూడా బీటలు వారుతుంది. ఆ తరువాత కొండరాళ్ళ మధ్య ఏర్పడ్డ బీటలలోకి వర్షం నీరు ఇంకుతుంది. దీంతో రాయి గుల్లదేరుతుంది. అనంతరం బీటలు వారిన కొండ రాళ్ళ చుట్టూ ఉన్న నేల భాగం కూడా వర్షం కారణంగా గుళ్ళ బారి రాయిని పట్టి ఉంచే స్వభావంను పూర్తిగా కోల్పోతుంది. దీంతో వర్షాలు పడగానే కొండ చరియల్లో కదలికలు ఏర్పడి అవి. జారిపడుతున్నాయి..
కొండ ప్రాంతాలు విరిగిపడే ప్రాంతాలలో ఎప్పుడూ వార్తల్లో నిలిచే అతికొద్ది ప్రాంతాల్లో మొగల్రాజపురం నిమ్మతోట సెంటర్, దుర్గగుడి ఘాట్ రోడ్డు, కొత్తపేట కొండప్రాంతం, చిట్టినగర్, గుణదల గంగిరెద్దుల దిబ్బ. మల్లిఖార్జునపేట, 51వ డివిజన్ కొండ ప్రాంతం, విశాలాంధ్ర రోడ్డులోని గులాం మొహిద్దీన్ నగర్, చిట్టినగర్ సారంగానికి ఇరువైపుల ఉన్న కొండ ప్రాంతాల్లో వర్షాకాలంలో కొండ చరియలు విరిగిపడుతూ ఉంటాయి.రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే ఇళ్ళ సమస్య, పెరుగుతున్న ఇళ్ళ నగరంలో అద్దెలు, పేదరికం, భూసమస్యలతో పాటు బతుకు దెరువు కోసం పొట్టచేతపట్టుకుని నగరానికి.
వలస రావటం వంటి అనేక కారణాల చేత కొండప్రాంతాలు జనావాసాలుగా మారాయి. మరో గత్యంతరం లేక నిరుపేదలు కొండ ప్రాంతాల్లో ఇళ్ళు కట్టుకుని ఉంటున్నారు. ఇటువంటి తరుణంలో వారికి తగిన భద్రత, రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కనుక ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న కొండ ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకొని ప్రమాదాలను నివారించాలని కోరుతున్నారు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం