Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: బాగా మందేశాడు..! అమ్మాయిని బైక్‌పై ముందు కూర్చోబెట్టాడు.. ఆపై పాడు పని.. వీడియో

మాములుగా విజయవాడలో ఇలాంటి సీన్స్ చాలా రేర్.. పోలీసులు చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు. కానీ ఈ జంట మాత్రం మాకేం భయం అన్నట్లు బరి తెగించి వ్యవహరించారు. రాత్రి వేళ బైక్‌పై వెళ్తూ విశృంఖలంగా ప్రవర్తించారు. వీరి ఓవరాక్షన్‌ను తోటి ప్రయాణికులు వీడియో తీశారు..

Vijayawada: బాగా మందేశాడు..! అమ్మాయిని బైక్‌పై ముందు కూర్చోబెట్టాడు.. ఆపై పాడు పని.. వీడియో
Couple Bike Ride
Follow us
Ram Naramaneni

|

Updated on: May 19, 2025 | 4:09 PM

యువత పెడదారి పడుతోంది. సభ్యత, సంస్కారం లేకుండా ప్రవర్తిస్తోంది. పాశ్చాత్య ధోరణి పుణికిపుచ్చుకోని తెలుగు, భారతీయ సాంప్రదాయాలకు తిలోదకాలు వదులుతున్నారు. విజయవాడలో రద్దీగా ఉండే హైవేపై కదులుతున్న బైక్‌పై అభ్యంతరకంగా వ్యవహరిస్తూ ప్రయాణించారు ఓ జంట. రామలింగేశ్వర నగర్ ఫ్లైఓవర్ సమీపంలో రోడ్డుపై వీరి బాగోతాన్ని తోటి వాహనదారులు రికార్డు చేశారు. తమ భద్రతను పట్టించుకోకుండా.. సభ్యత లేకుండా వారు ప్రవర్తించిన తీరుపై నెట్టింట ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

విజయవాడ హైవేపై ఈ సంఘటన జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తూ జంట అనుచితంగా ప్రవర్తించడం మీరు దిగువన వీడియోలో చూడవచ్చు. బైక్ నడుతున్న వ్యక్తి తాగిన మత్తులో కనిపించాడని, ఇలాంటి చర్యల వల్ల వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లడమే కాకుండా తోటి ప్రయాణికులకు కూడా ప్రమాదం వాటిల్లిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రోడ్లపై ఇటువంటి నిర్లక్ష్య ప్రవర్తనలు పెరుగుతున్నాయని నివాసితులు, ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మద్యం తాగి వాహనాలు నడపడం, బహిరంగంగా అసభ్యకరంగా ప్రవర్తించడం వంటివి చేస్తున్నవారిపై ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. అధికారులు ఇలాంటి వారిపై స్వతహాగా కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు.

వీడియో దిగువన చూడండి…