Cyclonic Yaas: తీరం వెంబడి అలజడి సృష్టిస్తున్న సముద్రం.. శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో హై అలర్ట్

|

May 26, 2021 | 10:33 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన అతి తీవ్ర తుపాను యాస్​.. తీరానికి చేరువైంది. బుధవారం మధ్యాహ్నం ఒడిశాలోని బాలాసోర్​ దక్షిణ ప్రాంతంలో తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ( IMD) ప్రకటించింది. యాస్​ తుపాను.. ఒడిశాలోని....

Cyclonic Yaas: తీరం వెంబడి అలజడి సృష్టిస్తున్న సముద్రం.. శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో హై అలర్ట్
Very Severe Cyclonic Storm
Follow us on

బంగాళాఖాతంలో ఏర్పడిన అతి తీవ్ర తుపాను యాస్​.. తీరానికి చేరువైంది. బుధవారం మధ్యాహ్నం ఒడిశాలోని బాలాసోర్​ దక్షిణ ప్రాంతంలో తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ( IMD) ప్రకటించింది. యాస్​ తుపాను.. ఒడిశాలోని ధర్మాకు 60 కి.మీ.ల దూరంలో, పారదీప్​కు 90కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ వెల్లడించింది. ఉత్తర ధమ్రా – దక్షిణ బాలసోర్ (ఒడిశా) మధ్య ఈరోజు మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది.

ఇక యాస్ తుఫాన్ ప్రభావంతో భద్రక్​ జిల్లాలోని ధమ్రా ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదైంది. గంటకు 155 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరందాటే సమయంలో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 60-70 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు.

ఇక ఏపీలో కూడా యాస్ తుఫాన్ ప్రభావం కనిపించనుంది. దుగరాజపట్నం ( నెల్లూరు) నుంచి బారువ (శ్రీకాకుళం) వరకు తీరం వెంబడి సముద్రం అలజడిగా ఉంటుందని పేర్కొన్నారు. సముద్రంలో అలలు 2.5 – 5.0 మీటర్ల ఎత్తులో‌ ఎగసి పడుతాయని పేర్కొన్నారు.  సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మరో రెండు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఆదేశించారు. తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సూచించారు.

Cyclone Yaas: తీరానికి చేరువైన తుఫాన్ … నేడు ఒడిశాలోని భద్రక్‌ వద్ద విరుచుకుపడనున్న‘యాస్‌’

Etela New Profile Pick: ట్విట్టర్ ప్రొఫైల్ పిక్ మార్చిన ఈటల రాజేందర్‌.. ఇప్పుడు తెలంగాణలో ఇదే పెద్ద చర్చ..