Brahmamgari matam: వీడిన చిక్కుముడి.. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మఠం పీఠాధపతి ఆయ‌నే

|

Jun 26, 2021 | 9:07 PM

శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మఠం పీఠాధపతి వివాదంలో చిక్కుముడి వీడింది. పీఠాధిపతి వ్యవహారం కొలిక్కి వచ్చింది. పెద్ద భార్య పెద్ద కొడుకు వెంకటాద్రి స్వామిని

Brahmamgari matam:  వీడిన చిక్కుముడి.. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మఠం పీఠాధపతి ఆయ‌నే
Brahmangari Math
Follow us on

శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మఠం పీఠాధపతి వివాదంలో చిక్కుముడి వీడింది. పీఠాధిపతి వ్యవహారం కొలిక్కి వచ్చింది. పెద్ద భార్య పెద్ద కొడుకు వెంకటాద్రి స్వామిని 12 వ పీఠాధిపతి గా చేసేందుకు కుటుంబ స‌భ్యులు మూకుమ్మడి నిర్ణయం తీసుకున్నారు. ప్ర‌ధానంగా పెద్ద భార్య సంతానం, రెండో భార్య మారుతి మహాలక్ష్మి ఏకాభిప్రాయానికి వ‌చ్చారు. ఉత్తరాధికారిగా రెండో భార్య కుమారుడు వీర భద్ర స్వామి వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.  బ్రహ్మంగారిమఠం ప్రతిష్టను దృష్టిలో ఉంచుకునే ఉత్తరాధికారిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యానని వీరభద్ర స్వామి చెప్పారు. వెంకటాద్రి స్వామి తదనంతరం తానే పీఠాధిపతి అవుతానని.. చర్చల్లో అందరూ కూర్చొని ఒక నిర్ణయం తీసుకున్నామ‌ని ఆయ‌న చెప్పారు.

వీరబ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి మరణం తరువాత ఇద్దరి భార్యల కుమారులు తమకే పీఠాధిపతిగా అవకాశం ఇవ్వాలని ప‌ట్టుబ‌ట్ట‌డంతో.. గత కొద్ది రోజులుగా వివాదం కొనసాగింది. ఇద్దరు సోదరుల మధ్య కుటుంబ ఆధిపత్య పోరు తీవ్రం కావడంతో ఇది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దాంతో, మఠం పీఠాధిపతి ఎంపిక వ్యవహారం తేల్చేందుకు ఏపీ స‌ర్కార్ ప్రత్యేక అధికారిని నియమించింది. దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్‌కు ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతలు అప్పగించింది. దీంతో స‌ద‌రు అధికారి రెండు కుటుంబాలతో చర్చలు జరిపింది. చివరకు పెద్ద భార్య కుమారుడు వెంకటాద్రిస్వామికి తొలుత పీఠాధిపతిగా అవకాశం ఇచ్చి, రెండో భార్య కుమారుడు వీరభద్రయ్యను ఉత్తరాధికారిగా ఎంపిక చేయాలనే ప్రతిపాదనకు ఇరువర్గాలూ అంగీకారం తెలిపాయి. దీంతో, ఈ వివాదానికి తెరపడింది.

Also Read:  తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం

‘కొత్త జంటల శోభనానికి పనికిరావు’…జగనన్న ఇళ్లపై సొంత పార్టీ ఎమ్మెల్యే కామెంట్