Chittoor: లిక్కర్ లోడ్‌తో వెళ్తోన్న వాహనం బోల్తా.. సీసాల కోసం ఎగబడ్డ జనాలు

|

Aug 17, 2023 | 9:10 AM

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని వడ్డేపల్లె సమీపంలో ప్రభుత్వ మద్యం స్టాక్‌ చేసే కేంద్రం ఉంది. ఇక్కడి నుంచి మద్యం సీసాలు ఇతర దుకాణాలకు సరఫరా చేస్తుంటారు. ఈ నేపథ్యంలో బుధవారం (ఆగస్టు 16) ఓపెన్‌ టాప్‌ టెంపోలో మద్యం సీసాలతో ఉన్న మద్యం పెట్టెలు తరలిస్తున్నారు. చిత్తూరు-తిరుపతి జాతీయ రహదారిపై పూతలపట్టు సమీపంలో వాహన ముందు చక్రం పంక్చరైంది. ప్రభుత్వ మద్యం సీసాలు తీసుకెళ్తున్న వాహనం ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో కొన్ని..

Chittoor: లిక్కర్ లోడ్‌తో వెళ్తోన్న వాహనం బోల్తా.. సీసాల కోసం ఎగబడ్డ జనాలు
Vehicle Carrying A Load Of Liquor Overturned
Follow us on

చిత్తూరు, ఆగస్టు 17: లిక్కర్ లోడ్‌తో వెళ్తోన్న మినీ వ్యాన్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. బీర్, బ్రాంది, విస్కీ, వైన్ ఇలా అన్ని బ్రాండ్‌ సీసాలు ఒక్కసారిగా రోడ్డుపై పడి పగలడంతో మద్యం ఏరులై పారింది. దీంతో స్థానికులు మద్యం బాటిల్ల కోసం ఎగబడ్డారు. బోల్తా పడిన వ్యాన్లో ఎవరైనా ప్రమాదానికి గురైయ్యారా.. దెబ్బలేమైనా తగిలాయా.. అని కనీసం ఒక్కరు కూడా చూడకపోవడం గమనార్హం. అందినకాడికి మందు సీసాలు ఎత్తుకెళ్లారు. కొందరు అయితే బస్తాలతో, బకెట్లతో వచ్చిమరీ మద్యం సీసాలు ఎత్తుకెళ్లారు. మద్యం మనుషుల్లో మానవత్వం చచ్చిపోయేలా చేసిందా? అనేలా ఉందా దృశ్యం. ఇంతకీ ఎక్కడ జరిగిందంటే..

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని వడ్డేపల్లె సమీపంలో ప్రభుత్వ మద్యం స్టాక్‌ చేసే కేంద్రం ఉంది. ఇక్కడి నుంచి మద్యం సీసాలు ఇతర దుకాణాలకు సరఫరా చేస్తుంటారు. ఈ నేపథ్యంలో బుధవారం (ఆగస్టు 16) ఓపెన్‌ టాప్‌ టెంపోలో మద్యం సీసాలతో ఉన్న మద్యం పెట్టెలు తరలిస్తున్నారు. చిత్తూరు-తిరుపతి జాతీయ రహదారిపై పూతలపట్టు సమీపంలో వాహన ముందు చక్రం పంక్చరైంది. ప్రభుత్వ మద్యం సీసాలు తీసుకెళ్తున్న వాహనం ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో కొన్ని మద్యం సీసాలు రోడ్డుపై పడి పగిలిపోయాయి. మరికొన్ని రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. గమనించిన పాదచారులు, స్థానికులు, అటుగా వెళ్తున్న వాహనదారులు సీసాలు తీసుకెళ్లేందుకు ఎగబడ్డారు. సమీపంలోని మద్యం ప్రియులకు ఈ విషయం తెలియడంతో బకెట్టు, సంచులతో పరుగు పరుగున వచ్చి అందినకాడికి ఎత్తుకెళ్లారు. అవి ప్రభుత్వం సరుకని, వాటిని తీసుకెళ్లవద్దని డ్రైవర్ బ్రతిమిలాడిన జనాలు పట్టించుకోలేదు. ఈ ఘటనలో సుమారు రూ.6 లక్షల నష్టం వాటిల్లిందని సమాచారం.

మరో ఘటన.. శ్రీకాకుళం నాగావళి నదిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

విశాఖపట్నానికి చెందిన కోన ఆనంద్‌ కుటుంబం తమ బంధువుల ఇంట్లో ఓ ఫంక్షన్‌ నిమిత్తం మంగళవారం శ్రీకాకుళం వెళ్లారు. ఈ క్రమంలో ఆనంద్‌ తన ఇద్దరు కుమారులు కార్తికేయ(11), గణేష్‌ గౌతమ్‌(7)లతో వర్షిత్‌ అనే బంధువుల అబ్బాయిని తీసుకుని సమీపంలోని నాగావళి నది వద్దకు వెళ్లారు. స్నానం చేయడానికి నదిలోకి దిగిన పిల్లలు అక్కడ భారీ గొయ్యి ఉండటం గమనించలేదు. దీంతో ముగ్గురు పిల్లలూ నీట మునిగిపోయారు. వెంటనే ఆనంద్‌ తేరుకుని వర్షిత్‌ను రక్షించాడు. ఈలోగా ఆనంద్‌ కుమారులిద్దరూ కార్తికేయ, గణేష్‌ గౌతమ్‌ నదిలో కొట్టుకుపోయారు. సమీపంలోని రేవు వద్ద కొనఊపిరితో ఉన్న పిల్లలను స్థానికులు బయటకు తీసి ఆసుపత్రికి తలరించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలొదిలారు. కళ్లెదుటే ఇద్దరు పిల్లల మృతదేహాలను చూసిన తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇసుక అక్రమ తవ్వకాలే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.