Vegetable prices: సామాన్యులకు షాక్..పెట్రోల్‌, డీజిల్‌కు పోటీగా కూరగాయలు

ఓ వైపు ఆగని పెట్రోల్ మంట, మరో వైపు గుది బండగా గ్యాస్ బండ. నిత్యావసర వస్తువుల ధర పెరుగుదల.. ఇవే కాకుండా ప్రస్తుతం కూరగాయల ధరలు కూడా సామాన్యులను టెన్షన్ పెడుతున్నాయి.

Vegetable prices: సామాన్యులకు షాక్..పెట్రోల్‌, డీజిల్‌కు పోటీగా కూరగాయలు
Vegetable Prices

Updated on: Nov 02, 2021 | 11:59 AM

ఓ వైపు ఆగని పెట్రోల్ మంట, మరో వైపు గుది బండగా గ్యాస్ బండ. నిత్యావసర వస్తువుల ధర పెరుగుదల.. ఇవే కాకుండా ప్రస్తుతం కూరగాయల ధరలు సైతం కొండెక్కి కుర్చుని సామాన్యుని నడ్డి విరుస్తున్నాయి.. పెరుగుతున్న ధరలతో కూరగాయలు కొనాలంటే కన్నీళ్ళు వచ్చే పరిస్థితి ఏర్పడింది..అకాల వర్షాలతో పంట దిగుబడి తగ్గి, ఉత్పత్తి తగ్గిపోవడంతో కూరగాయల రేట్లు అమాంతం పెరిగిపోయాయి.. కేవలం 5 నుండి పదిహేను రోజుల వ్యవధిలో కూరగాయ ధరలు రెట్టింపుకు చేరాయి..ఇంకా ఉల్లి, మిరప కొనుగోలు చేయాలంటే మరీ కష్టంగా మారింది పరిస్థితి.

గతంలో రెండువందల రూపాయలతో మార్కెట్ కు వెళితే సంచి నిండా కూరగాయలు తీసుకెళ్లే వాళ్ళం… అని కానీ ప్రస్తుతం ఆ డబ్బులకు రెండు పూటలకు సరిపడా కూరగాయలు కూడా ఇంటికి తీసుకెళ్ల లేక పోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఒక వారం క్రితం వరకు కిలోకి 15 నుండి 20 రూపాయలు ఉన్న కూరగాయల ధరలు.. ప్రస్తుతం ఒకేసారి 60 నుండి 70 రూపాయలకు పెరిగాయి. కొన్ని రకాలు కూరగాయల ధరలైతే ఏకంగా సెంచరీ కొట్టేశాయి. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నామని ఇక పచ్చడి మెతుకులే తమకు దిక్కు అయ్యేలా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సామాన్య ప్రజానీకం.

మరో వైపు కూరగాయలు అమ్మే రైతులూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ధరలు పెరిగిన కూడా తమకు లాభం లేదని అంటున్నారు.. ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు కూడా బాగా పెరిగిపోయాయని, రవాణా ఖర్చులకే సగం డబ్బులు పోతున్నాయంటూ రైతులు వాపోతున్నారు. ఇటు రైతులు, అటు సామాన్య ప్రజలు ఎవరూ సంతృప్తి లేని పరిస్థితికి కారణంగా పెరిగిపోయిన ఇంధన ధరలే ప్రధాన కారణంగా పలువురు ఆరోపిస్తున్నారు.

Also Read: Huzurabad By Election Result: హుజురాబాద్‌లో ప్రధాన పార్టీలకు ఇండిపెండెంట్స్ షాక్..