కోనసీమ ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. పచ్చని పైర్లు, నిటారైన కొబ్బరిచెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం అందర్నీ కట్టిపడేస్తుంది. దీనికి మించి గోదారోళ్ల వినూత్న పెళ్లిసందడి అంతా ఇంతా కాదు. పెళ్లివేడుకలు, ఊరేగింపులు, మేళతాళాలతో సాంప్రదాయ బద్ధంగా జరిగే పెళ్లిలు, అరటి ఆకుల్లో కమ్మని వంటలు..అబ్బో ఒకటేమిటి..? అదరహో అనిపిస్తుంది. ఐతే ఇందుకు భిన్నంగా కోనసీమజిల్లాలో తాజాగా జరిగిన ఓ పెళ్లివేడుక అందర్నీ ఆకట్టుకుంటోంది. పంజాబీ వేషధారణలో మేళతాళలతో పెళ్లికొడుకు జోడి గుర్రాలరథంపై రాజకుమారుడిలా ఊరేగుతూ వచ్చారు. ఇక అమ్మాయిలు బుల్లెట్‌బండి సాంగ్ ఎఫెక్టో ఏమోగానీ, మహారాష్ట్ర సంస్కృతిలో చీరలు కట్టి, బుల్లెట్ల బండ్లపై పెళ్లికొడుకు రథానికి ముందు ఆహ్వానం పలుకుతూ ముందుకు సాగడం పల్లెవాసులను ఎట్రాక్ట్ చేసింది.
డాక్టర్ బీఆర్. అంబేద్కర్ కోనసీమజిల్లా మామిడికుదురులో వెరైటీ పెళ్లి ఊరేగింపుపై అందరి దృష్టి పడింది. స్థానిక గ్రామానికి చెందిన గోకవరపు వారి కళ్యాణ వేడుకల్లో అవినాష్ వెడ్స్ లక్ష్మి పెళ్లి బరాత్ వెరైటీకి వేదికైంది. ఓ వైపు మేళతాళాలు, మరోవైపు బాణాసంచాలతో సందడిగా కనిపించారు. రాజుల కాలంనాటి జోడు గుర్రాల రథంపై పెళ్లికొడుకు అవినాష్ ఊరేగింపుగా రాగా, బుల్లెట్ బండ్లపై యువతులు చీరకట్టులో రథానికి ముందుకు కదలడం పల్లెవాసులను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ సంస్కృతి మహారాష్ట్రకు చెందిందని, యువతులు బుల్లెట్లపై ఊరేగింపుగా ఇప్పుడో కొత్త ట్రెండ్‌కు నాంది పలుకుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..