Varity Robbery Attempt: బ్యాంకులో చోరీకి ప్రయత్నించిన దొంగ.. సీసీ కెమెరా నుంచి తప్పించుకోవాటానికి గొడుగుతో కవరింగ్

|

Jul 07, 2021 | 8:29 PM

Varity Robbery Attempt: ఈ వింత దొంగ దొంగతనం చేస్తూ సిసి కెమెరా కంటికి చిక్కకుండా ఉండేందుకు ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. బ్యాంక్ కు చోరీ చేసే ప్రయత్నంలో ఆ దొంగ ఓ గొడుగును..

Varity Robbery Attempt: బ్యాంకులో చోరీకి ప్రయత్నించిన దొంగ.. సీసీ కెమెరా నుంచి తప్పించుకోవాటానికి గొడుగుతో కవరింగ్
Bank Chori
Follow us on

Varity Robbery: ఈ వింత దొంగ దొంగతనం చేస్తూ సిసి కెమెరా కంటికి చిక్కకుండా ఉండేందుకు ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. బ్యాంక్ కు చోరీ చేసే ప్రయత్నంలో ఆ దొంగ ఓ గొడుగును తన వెంట పట్టుకుని వెళ్ళాడు.. కరోనా కనుక .. మాస్క్ పెట్టుకోవడంతో మూతి ముక్కుని కవర్ చేస్తే.. ఈ గొడుగుతో తాను ఎవరో ఆ సిసి కెమెరాకు చిక్కకుండా జాగ్రత్తపడాలని అనుకున్నాడు.. అందుకనే గుట్టుచప్పుడు కాకుండా తాళాలు విరగ్గొట్టి బ్యాంకులోనికి చొరబడినా ఎక్కడా చేతిలోని గొడుగును వదలలేదు.. ఈ వింత దొంగను వెదికే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ ఘటన విశాఖ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..

విశాఖ జిల్లా రాంబిల్లిలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచి ఉద్యోగులు ఉదయం డ్యూటీకి వచ్చారు. అయితే బ్యాంకు తాళాలు పగల గొట్టి ఉండడం గమనించి .. దొంగలెవరో చొరబడి వుంటారని అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. బ్యాంకులోపలకు వెళ్ళారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌తో తనికీలు చేశారు. నగదు ఉన్న ప్రాంతానికి బ్యాంకు సిబ్బందితో కలిసి వెళ్ళారు. అక్కడ క్యాష్‌ సేఫ్‌గా ఉన్నట్టు గుర్తించారు బ్యాంకు సిబ్బంది

అసలు దొంగ తాళాలు పగల గొట్టి ఎలా వచ్చారు.. ఎంతమంది దొంగ తనం చేయడానికి వచ్చారు అన్న విషయం పై పోలీసులు ఎంక్వైరీ చేశారు. బ్యాంకులో ఉన్న సీసీ కెమెరా టేజీని పరిశీలించారు. అయితే.. అర్థరాత్రి దాదాపు రెండు గంటల ప్రాంతంలో ఓ దొంగ మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నట్టు గుర్తించారు. ముఖానికి మాస్క్‌, చేతిలో గొడుగు పట్టుకుని ఉన్నట్టు సీసీ కెమెరాలో రికార్డయ్యింది. అయితే.. దొంగ ఏ మూలకు వెళ్ళినా చేతిలో గొడుగు మాత్రం వదల్లేదు. బ్యాంకులో.. అదీ కూడా అర్థరాత్రి పూట వీడు గొడుగు ఎందుకు విప్పి తలపై పట్టుకున్నాడో కొంతసేపు వరకు అర్థకాలేదు పోలీసులకు. చివరకు సీసీ కెమెరా దగ్గరకు వచ్చే సరికి.. గొడుగు అలా పక్కకు జరిపి చూశాడు. దీంతో.. ఖాకీలకు అసలు కథ అర్థమైంది. అప్పటికే ముఖానికి మాస్క్‌లో ఉండి గుర్తుపట్టకుండా జాగ్రత్త పడిన ఆ దొంగ.. తన హావభావాలు కూడా కెమెరాకు చిక్కకుండా గొడుగు అడ్డంగా పెట్టుకున్నట్టు గుర్తించారు. ఈ వెరైటీ దొంగ వింత ప్రవర్తను చూసి పోలీసులు ముక్కున వేలేసుకున్నారు. బ్యాంకులో చొరబడినా.. క్యాష్‌ చోరీకి మాత్రం విఫలయత్నం చేశాడు. చిల్లిగవ్వ కూడా ఆ బ్యాంకునుంచి ఎత్తుకెళ్ళలేకపోయాడు. బ్యాంకు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ గొడుగు దొంగ కోసం గాలింపు మొదలుపెట్టారు.

Also Read: శ్రీ నారాయణ ధర్మ సంఘం మాజీ అధ్యక్షులు స్వామి ప్రకాశానంద శివైక్యం.. ప్రధాని మోడీ సంతాపం