గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలో వింత పురుగుల కలకలం.. ఒంటిపై పాకితే దురద, దద్దుర్లు
గుంటూరు జిల్లాలో వింత పురుగులు కలకలం రేపుతున్నాయి. ఆ పురుగు కనబడితేనే ప్రజల్లో భయం ఆందోళన మొదలవుతోంది.
గుంటూరు జిల్లాలో వింత పురుగులు కలకలం రేపుతున్నాయి. ఆ పురుగు కనబడితేనే ప్రజల్లో భయం ఆందోళన మొదలవుతోంది. రొంపిచర్ల మండలంలోని పలు గ్రామాల్లో ఈ పురుగులు సంచరిస్తున్నాయి. ఆ పురుగులు ఒంటిపై వాలినా.. కుట్టినా దురదలు, దద్దుర్లు వస్తున్నాయని వీరవట్నం సుబ్బయ్యపాలెం, విప్పర్లపల్లి గ్రామాల్లో ప్రజలు చెబుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. వెంటనే సంబంధిత సంబంధించిన అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ పురుగుల దెబ్బకు ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సుబాబుల్ తోటల వల్లే పురుగులు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి వాటిని చూడలేదని రైతులు కూడా చెబుతున్నారు. ఊరంతా మందులు పిచికారీ చేయించనప్పటికీ వాటి బెడద వీడటం లేదని చెబుతున్నారు. ఈ పురుగులు ఏంటి, ఎక్కడ్నుంచి వచ్చాయన్న అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. గ్రామాల్లో తిరుగుతున్న ఆ పురుగుల్ని పరిశీలిస్తున్నారు. ఇదే పురుగు రైతు భరోసా కేంద్రం వద్ద మీటింగ్ లో ఉన్నప్పుడు ఒక వ్యవసాయ శాఖ అధికారికి కనిపించింది. అది తన చర్మానికి తాకకుండా ఆయన కంగారుపడటం దిగువన ఫోటోలో మీరు చూడవచ్చు.
Also Read: సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఆ కుటుంబాలకూ ఆర్థిక సాయం.. ఏప్రిల్ 6న నిధుల విడుదల
విద్యారంగంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై అన్ని కాలేజీలకు జేఎన్‌టీయూ ప్రశ్నాపత్రాలే