Vande Bharat Sleeper Trains: తెలుగు రాష్ట్రాల్లో పరుగులు పెట్టనున్న 2 వందే భారత్ స్లీపర్ రైళ్లు..! ఏయే మార్గాల్లో అంటే

దేశవ్యాప్తంగా మంచి స్పందన పొందిన వందే భారత్ రైళ్లను మరింత అభివృద్ధి చేస్తూ కేంద్రం కొత్త స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా తెలుగు రాష్ట్రాలకు రెండు వందే భారత్ స్లీపర్ రైళ్లు పరుగులు పెట్టనున్నట్లు సమాచారం. అవి ఏయే రూట్లలో వెళ్తాయో ఈ కథనంలో తెలుసుకుందాం...

Vande Bharat Sleeper Trains: తెలుగు రాష్ట్రాల్లో పరుగులు పెట్టనున్న 2 వందే భారత్ స్లీపర్ రైళ్లు..! ఏయే మార్గాల్లో అంటే
Vande Bharat Sleeper Trains

Updated on: May 25, 2025 | 5:03 PM

తెలుగు రాష్ట్రాలకు కొత్త వందే భారత్ స్లీపర్ రైళ్లు రాబోతున్నాయ్. దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లకు విశేష ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో, కేంద్రం వీటి సేవలను మరింత విస్తరించేందుకుర రెడీ అయింది. త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లు దేశ ప్రజల అందుబాటులోకి రానున్నాయ్. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలకు శుభవార్తగా, మొదటి విడతలోనే రెండు వందే భారత్ స్లీపర్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్ రాబోతున్నట్లు తెలిసింది.

 ఢిల్లీ – సికింద్రాబాద్ స్లీపర్ రైలు

ప్రయాణ మార్గం:
న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే ఈ వందే భారత్ స్లీపర్ రైలు ఆగ్రా క్యాంట్, గ్వాలియర్, ఝాన్సీ, భోపాల్, ఇటార్సి, నాగపూర్, బల్హార్షా, కాజిపేట్ జంక్షన్ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది.

సమయం:
రాత్రి 8:50 గంటలకు న్యూఢిల్లీ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8:00 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

టికెట్ చార్జీలు:

  • థర్డ్ ఏసీ: రూ 3600
  • సెకండ్ ఏసీ: రూ 4800
  • ఫస్ట్ ఏసీ: రూ 6000

విజయవాడ – బెంగళూరు స్లీపర్ రైలు

ప్రయాణ మార్గం:
విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరు వరకు ఈ వందే భారత్ స్లీపర్ రైలు సేవలు అందించనుంది.

ఇదే కాకుండా విజయవాడ నుంచి అయోధ్య, వారణాసి వంటి ప్రదేశాలకు వందే భారత్ సర్వీసులు ప్రారంభించే అవకాశముందని సంబంధిత అధికారుల వర్గాల ద్వారా తెలిసింది. వందే భారత్ రైళ్ల ద్వారా ముఖ్య నగరాలకు వేగవంతంగా ప్రయాణం చేసేందుకు వీలువుతుంది. అలానే.. ప్రయాణం కూడా సౌకర్యవంతంగా ఉంటుంది.

ఇంకా మరిన్ని మార్గాల్లో వందే భారత్ సేవలను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ రెండు సర్వీసులపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇవి మంచి ఉపయుక్తంగానే ఉంటాయని చెప్పాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..