బ్రిటీష్ వారిని ఎదురించేందుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఏర్పాటు చేసిన ఫిరంగి..

మనం ఎంతోమంది స్వతంత్ర సమరయోధుల గురించి వినే ఉంటాం.. వారి ప్రత్యేకతలు కూడా తెలుసుకొని ఉంటాం. అలాంటి స్వాతంత్య్ర సమరయోధులలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రకి, పోరాటాలకు చెందిన ఆనవాళ్లు ప్రకాశంజిల్లాలో కూడా అక్కడక్కడ దర్శనమిస్తూనే ఉన్నాయి. నరసింహారెడ్డి వీరోచిత పోరాటాల ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి ' సైరా నరసింహారెడ్డి' సినిమా కూడా తీసిన సంగతి తెలిసిందే. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ వారికి నిద్ర లేకుండా చేశారని కథలు కథలుగా చెప్పుకుంటారు.

బ్రిటీష్ వారిని ఎదురించేందుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఏర్పాటు చేసిన ఫిరంగి..
Cannon

Edited By:

Updated on: Oct 01, 2023 | 6:11 PM

మనం ఎంతోమంది స్వతంత్ర సమరయోధుల గురించి వినే ఉంటాం.. వారి ప్రత్యేకతలు కూడా తెలుసుకొని ఉంటాం. అలాంటి స్వాతంత్య్ర సమరయోధులలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రకి, పోరాటాలకు చెందిన ఆనవాళ్లు ప్రకాశంజిల్లాలో కూడా అక్కడక్కడ దర్శనమిస్తూనే ఉన్నాయి. నరసింహారెడ్డి వీరోచిత పోరాటాల ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి ‘ సైరా నరసింహారెడ్డి’ సినిమా కూడా తీసిన సంగతి తెలిసిందే. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ వారికి నిద్ర లేకుండా చేశారని కథలు కథలుగా చెప్పుకుంటారు. అయితే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సొంత జిల్లా కర్నూలు కాగా బ్రిటిష్ వారితో పోరాడుతున్న క్రమంలో ప్రకాశం జిల్లాలో గిద్దలూరు పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. గిద్దలూరు మండలం కొత్తకోట గ్రామంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సంచరించిన అనవాళ్ళు చాలానే ఉన్నాయి.

కొత్తకోట గ్రామంలో బ్రిటిష్ వారిని ఎదుర్కోవటానికి అప్పట్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫిరంగిని ఏర్పాటు చేశారు. ముండ్లపాడు గ్రామ సమీపంలో బ్రిటిష్ వారితో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యం విరోచితంగా పోరాడిందని నేటికీ ఈ ప్రాంతంలో కథలు కథలు గా చెప్పుకుంటారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటీష్ వారి వ్యూహాలను ఎప్పటికప్పుడు పసిగడుతూ వారిని ఎదుర్కొనే వారని చరిత్ర చూస్తే తెలుస్తుంది. నేటికీ ఈ ప్రాంతంలో ఆయన ఏర్పాటు చేసిన ఫిరంగి శత్రువులపై దాడి చేసేందుకు తయారు చేసిన గుండు దర్శనమిస్తుంది. అంతేకాకుండా ముండ్లపాడులో ఉన్న నరసింహ స్వామి దేవాలయంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తలదాచుకున్నారని గ్రామస్తులు చెబుతుంటారు. ఆలయంలో నరసింహారెడ్డి దాక్కున్నారన్న అనుమానంతో బ్రిటిష్ వారు బుల్లెట్ల వర్షం కురిపించారట. అప్పుడు ఇక్కడ ఉన్న నరసింహస్వామి విగ్రహం స్వల్పంగా ధ్వంసం అయిందని ఆ ఆనవాళ్లు నేటికీ ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.

అంతేకాదు కొత్తకోటలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నిర్మించిన కోట అన్నవాళ్లు నేటికీ కూడా చెక్కుచెదరకుండా అలానే ఉండటం మరో విశేషం. ఆయన ఉపయోగించిన ఆయుధాలు భద్రంగా ఉండటమే కాదు.. ఆ ఆయుధాలు నేటికీ కూడా తుప్పు పట్టకుండా ఉన్నాయంటే అది మామూలు విషయం కాదు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉపయోగించిన ఆయుధాలను తరతరాల నుంచి ముండ్లపాడు గ్రామస్తులు సంరక్షిస్తూ వస్తున్నారు. అయితే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను తెలిపే అన్నవాళ్లను ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుని టూరిజం స్పాట్ గా ఈ ప్రాంతాన్ని గుర్తించి అభివృద్ధి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరోవిషయం ఏంటంటే బ్రిటిష్ వారిని ఎదుర్కోవటానికి అప్పట్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఏర్పాటు చేసిన ఫిరంగిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చూసేందుకు వస్తుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..