ఐఏఎస్ కలలు మీవి… కోట్లు వాళ్లవి… కోచింగ్ సెంటర్లు కావు.. కార్పొరేట్ సంస్థలు

10-11 లక్షల మంది అభ్యర్థులు... ఏళ్ల తరబడి సాగే మహా యజ్ఞం... దేశ వ్యాప్తంగా వందల సంఖ్యలో కోచింగ్ సెంటర్లు... ఏటా సుమారు రూ.3 వేల కోట్ల బిజినెస్..భర్తీ చేసే పోస్టులు మాత్రం కేవలం 1000 నుంచి 1100. ఇదంతా ఏటా దేశ వ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఐఏఎస్, ఐపీఎస్ పరీక్షల గురించే.

ఐఏఎస్ కలలు మీవి... కోట్లు వాళ్లవి... కోచింగ్ సెంటర్లు కావు.. కార్పొరేట్ సంస్థలు
యూపీఎస్సీ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు (SOURCE:ANI)

Updated on: May 20, 2024 | 11:39 AM

సివిల్స్…ఈ పేరు వింటనే…గూస్ బంప్స్ వస్తాయి. ఇక IAS సాధిస్తే… అంతకు మించిన సక్సెస్సే లేదన్న రేంజ్‌లో ఉంటాయి సెలబ్రేషన్స్. రిజల్ట్స్ వచ్చిన రెండు మూడు రోజులు ఏ మీడియాలో చూసినా విజేతల కథనాలు… వాళ్ల ఇంటర్వ్యూలే. ఎలా చదివారు.. ఎలా ఇంటర్వ్యూ ఫేస్ చేశారు.. ఎలా సక్సెస్ సాధించారు.. ఇలా ప్రతి ఒక్కరి విజయగాధల్ని ప్రతి అక్షరంలోనూ వివరించే ప్రయత్నం చేస్తారు రాసేవాళ్లు. ఇక వారిపై కురిసే ప్రశంసల గురించి మనం పెద్దగా డిస్కస్ చేసుకోవాల్సిన పని కూడా లేదు. ఇదంతా ఇప్పుడెందుకు డిస్కస్ చెయ్యాల్సి వస్తోందంటే.. ఈ ఏడాదికి సివిల్స్ పరీక్షకు అప్లై చేసిన వాళ్లంతా మరో ఆరు రోజుల్లో అంటే మే 26 తేదీన జరగబోయే ప్రిలిమ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు . అందుకే ఈ విషయాన్ని చర్చించేందుకు ఇదే సరైన సమయం. ఆ ఒక్క సక్సెస్… ఆ ఒక్కరి జీవితాల్ని మార్చేయవచ్చు… కానీ మిగిలిన లక్షలాది మంది ఫెల్యూర్స్‌ సంగతేంటి..? కేవలం 0.2 శాతం సక్సెస్ రేటును ఆశగా చూపించి లక్షలాది మంది నుంచి వేల కోట్ల రూపాయలు దండుకుంటున్న కోచింగ్ సెంటర్ల మాటేంటి? ప్రతి వెయ్యి మందిలో ఇద్దరు ఈ ఏడాది సివిల్ సర్వీసెస్‌లో యూపీఎస్సీ భర్తీ చేస్తున్న ఖాళీలెన్నో తెలుసా..? అక్షరాలా 1056… అందులో వైకల్యంతో ఉన్న వారికోసం రిజర్వ్ చేసిన సంఖ్య 40. ఈ పరీక్షలకోసం దరఖాస్తు చేసే అభ్యర్థుల సంఖ్య సుమారు 10 నుంచి 11 లక్షలు....

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి