భలే భలే.. చెట్టుకు కాయలు కాదు.. డైరెక్ట్‌గా తొనలే కాస్తున్నాయి.. పనస చెట్టు పదనిసలు..!

ఇంట్లో పనసపండు ఉంటే ఎంత దాచిపెట్టినా దాగదట..! ఎందుకంటే ఆ కాయ సైజు అంత పెద్దగా ఉంటుంది. దాని ఘుమఘుమలాడే సువాసన ఇల్లంతా పాకేస్తుంది. ఇక పనస తొనలో మాధుర్యం చెప్పనక్కర్లేదు. అటువంటి పనసపండు ఇంట్లో ఒకటి ఉంటే ఆ సంతోషమే వేరు. సీజన్‌లో ఒక్క పండైనా తీసుకొచ్చి దాన్ని కోసి తొనలు తీసి.. తినేందుకు చాలామంది ఇప్పటికీ ఒక అలవాటుగా మార్చుకున్నారు.

భలే భలే.. చెట్టుకు కాయలు కాదు.. డైరెక్ట్‌గా తొనలే కాస్తున్నాయి.. పనస చెట్టు పదనిసలు..!
Jackfruit Tree

Edited By:

Updated on: Jun 13, 2025 | 8:06 PM

ఇంట్లో పనసపండు ఉంటే ఎంత దాచిపెట్టినా దాగదట..! ఎందుకంటే ఆ కాయ సైజు అంత పెద్దగా ఉంటుంది. దాని ఘుమఘుమలాడే సువాసన ఇల్లంతా పాకేస్తుంది. ఇక పనస తొనలో మాధుర్యం చెప్పనక్కర్లేదు. అటువంటి పనసపండు ఇంట్లో ఒకటి ఉంటే ఆ సంతోషమే వేరు. సీజన్‌లో ఒక్క పండైనా తీసుకొచ్చి దాన్ని కోసి తొనలు తీసి.. తినేందుకు చాలామంది ఇప్పటికీ ఒక అలవాటుగా మార్చుకున్నారు.

కొంతమంది మార్కెట్లో పనస పళ్ళను కొనుగోలు చేసి తీసుకొస్తే.. మరికొంతమంది నేరుగా తోటలోకి వెళ్లి చెట్టు కాసిన కాయను కోసుకొని తీసుకొస్తారు. ఇంతవరకు బాగానే ఉంది.. కానీ ఆ కాయను కోసి తొనలు బయటకు తీయాలంటే కొంతమందికి ఒక సవాల్. తినాలని నోరూరుతుంది.. కానీ ఆ తొనలు తీయడం ఒక పెద్ద టాస్క్ అవుతుంది. దీంతో కొంతమంది నేరుగా మార్కెట్లో లభించే పనస తొనలను కొనుగోలు చేసుకుని తిని.. సంతృప్తి చెందుతూ ఉంటారు.

అయితే.. అటువంటి వారికి నేరుగా చెట్టుకే తొనలు కనిపిస్తే..! ఇక ఆ ఆనందం మామూలుగా ఉంటుందా మరి. అటువంటి చెట్టు కనిపిస్తే వదిలే అవకాశం ఉంటుందా..? తాజాగా చెట్టుకు కనిపించే పనస తొనలను తీసి తినేందుకు పరుగులు పెడతారు. పనస చెట్టుకు తొనలు కాస్తాయా..? ఇంపాసిబుల్ కదా..! అలా కాస్తే అది వింతే..! ఎస్.. అటువంటి వింతే జరిగింది అల్లూరి ఏజెన్సీలో.. దీంతో ఆ విచిత్ర చెట్టును ఆసక్తిగా తిలకిస్తున్నారు జనం.

అల్లూరు జిల్లా చింతపల్లి మండలం తమ్ముంగుల పంచాయతీ మారుమూల ప్రాంతమైన ఓ గ్రామం. ఊరు పేరు కిమిలి సింగు. అక్కడక్కడ విసిరి పారేసినట్టు గిరిజన గూడెలు అక్కడ ఉంటాయి. అక్కడ గణేష్ అనే ఒక గిరిజనుడు నివాసం ఉంటున్నాడు. ఆ ఇంటి పెరట్లో ఓ పనస చెట్టు నాటాడు. ఏళ్లుగా ఆ పనస చెట్టు కాయలు కాస్తూ, గణేష్ కు ఆదాయం తెచ్చిపెడుతుంది. సీజన్ వచ్చిందంటే చాలు గుత్తుల గుత్తులుగా కాయలు కాస్తూ ఉంటుంది ఆ పనస చెట్టు. అయితే ఈ ఏడాది ఆ చెట్టులో దృశ్యం కనిపించింది. పనసకాయల మధ్యన.. నేరుగా పనస తొనలు కనిపించాయి. తొలుత ఏదో అని గుర్తించని గణేష్.. ఆ తర్వాత అవి క్రమంగా పెద్దదవుతుంటే చూశాడు. పనస తొనలే నేరుగా కనిపిస్తుండడంతో చూసి ఆశ్చర్యపోయాడు. పనస చెట్టు కాండానికి కాసిన కాయల మధ్య ఓ కాయ పొట్టలోంచి విచ్చుకొని బయటకు తొనలు వచ్చినట్టు కనిపిస్తున్నాయి.

నిజంగా ఇది వింతే కదా..!

వాస్తవానికి పనస చెట్టుకు కాయలు కాస్తాయి. చెట్టు కాండానికి గుత్తుల గుత్తులుగా కాయలు కాస్తు కనిపిస్తాయి. అటువంటి కాయలో ఉన్న తొనల కోసం చిన్న గాటు పెట్టిన సరే.. ఆ కాయ పెరగదు కుళ్ళిపోతుంది. కానీ.. నేరుగా ఓ కాయ విచ్చుకొని.. అందులోంచి తొనలు బయటకు వచ్చి చెట్టుకే ఆ తొనలు పెరుగుతూ ఉంటే అంతకంటే ఆశ్చర్యం ఇంకేముంటుంది..? గణేష్ ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. తన ఇంటి పెరట చెట్టుకి ఇటువంటి వింతగా తొనలు కాయడంతో అంతకంటే అదృష్టం ఇంకేముంటుందిలే అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు గణేష్. విషయం ఆ నోటా ఈ నోటా పాకడంతో.. పరిసర గ్రామాల ప్రజలు ఆ వింతను చూసేందుకు క్యూకడుతున్నారు.

వీడియో చూడండి.. 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..