Jyotiraditya Scindia: రాజమండ్రి నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం.. జ్యోతిరాదిత్య సింధియా కీలక వ్యాఖ్యలు..

రాజమండ్రి విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా భూమి పూజ చేశారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య టెర్మినల్ భవన శంకుస్థాపన కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. సుమారు.347.15 కోట్లతో టెర్మినల్ బిల్డింగ్, ఇతర అభివృద్ధి పనులను కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా  ప్రారంభించారు.

Jyotiraditya Scindia: రాజమండ్రి నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం.. జ్యోతిరాదిత్య సింధియా కీలక వ్యాఖ్యలు..
Jyotiraditya Scindia

Updated on: Dec 10, 2023 | 3:20 PM

రాజమండ్రి విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా భూమి పూజ చేశారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య టెర్మినల్ భవన శంకుస్థాపన కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. సుమారు.347.15 కోట్లతో టెర్మినల్ బిల్డింగ్, ఇతర అభివృద్ధి పనులను కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా  ప్రారంభించారు.పెరుగుతున్న అవసరాల దృష్ట్యా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని.. దాని ప్రకారమే రాజమండ్రిలో నూతన టెర్మినల్ నిర్మాణం జరుపుతున్నామని సింధియా తెలిపారు. కొత్త టెర్మినల్ 17000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మితమవుతుందని తెలిపారు. ఇది ప్రస్తుత టెర్మినల్ కంటే 4 రెట్లు ఎక్కువగా ఉంటుందని.. రాజమండ్రి విమానాశ్రయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.

రాజమండ్రి నగరాన్ని అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతామని, ఇక్కడి నుంచి అన్ని ప్రాంతాలకు విమానాలు వెళ్లేలా కృషి చేస్తామని కేంద్ర జ్యోతిరాదిత్య సింధ్య తెలిపారు. మోడ్రన్ టెక్నాలజీతో అద్భుతమైన ఫీచర్లతో టెర్మినల్ నిర్మాణం జరుగుతుందన్నారు. టెర్మినల్ నిర్మాణం పూర్తైతే రాజమండ్రి నుంచి అన్ని ప్రాంతాలకు విమాన సర్వీసులను అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి దేశంలో 10 నగరాలకు విమాన సర్వీసులు నడుస్తున్నాయని పేర్కొన్నారు. అంతకుముందు టెర్మినల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన సింధియా.. రాజమండ్రి నేలపై నిలబడినందుకు సంతోషంగా ఉందన్నారు. సంస్కృతి సంప్రదాయాలకు రాజమండ్రి నెలవు అంటూ కొనియాడారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, ఎంపీ భరత్, మంత్రి అమర్నాథ్, ఎమ్మెల్యే జక్కంపూడి తదితరులు పాల్గొన్నారు. ఎయిర్‌పోర్ట్ లో మరో టెర్మినల్ శంకుస్థాపనతో రాజమహేంద్రవరం ఎయిర్ పోర్ట్ కు మరింత గుర్తింపు రానుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..