Andhra Pradesh: ఆగిన గుండెకు ఊపిరి పోసిన ఇద్దరు మహిళలు.. వీడియో వైరల్.. నెటిజన్ల ప్రశంసలు..

|

Feb 24, 2023 | 4:12 PM

ఆగిన గుండెకు మళ్లీ ఊపిరి పోశారు. తోటి మహిళ గుండెపోటుతో కుప్పకూలిపోగా.. వెంటనే అలర్ట్ అయిన మరో ఇద్దరు మహిళలు.. ఆగిన గుండెను మళ్లీ కొట్టుకునేలా చేశారు.

Andhra Pradesh: ఆగిన గుండెకు ఊపిరి పోసిన ఇద్దరు మహిళలు.. వీడియో వైరల్.. నెటిజన్ల ప్రశంసలు..
Andhra Pradesh Cpr
Follow us on

ఆగిన గుండెకు మళ్లీ ఊపిరి పోశారు. తోటి మహిళ గుండెపోటుతో కుప్పకూలిపోగా.. వెంటనే అలర్ట్ అయిన మరో ఇద్దరు మహిళలు.. ఆగిన గుండెను మళ్లీ కొట్టుకునేలా చేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాళ్లెవరో కాదు.. ఒకరు జర్నలిస్ట్, మరొకరు ఏఎన్ఎం. ఈ ఇద్దరూ స్పందించిన తీరుపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..పెద్దాపురం మండలం జి. రాగంపేట గ్రామంలో అంబటి అయిల్ మిల్ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే మృతులను చూడటానికి వచ్చిన బంధువులలో ఒక మహిళ.. ఆ మృత దేహాలను చూసి స్పృహ కోల్పోయింది. ఆ వెంటనే ఆమె గుండె కొట్టుకోవడం నెమ్మదించింది. అంతలోనే గుండె పూర్తిగా కొట్టుకోవడం ఆగింది. ఇది గమనించిన స్థానిక రిపోర్టర్ మున్ని, విషయాన్ని అక్కడే ఉన్న ఏఎన్ఎం ప్రశాంతికి చెప్పింది. ఇద్దరూ కలిసి ఆమెకు సీపీఆర్ చేశారు. వారు చేసిన ప్రయత్నం ఫలించింది. ఆగిన గుండె మళ్లీ కొట్టుకుంది. దీంతో బంధువులు, అక్కడికి వచ్చిన వారు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఆగిన గుండెకు ఊపిరి పోసి బ్రతికించిన ఆ ఇద్దరి యువతులకు బ్రతికిన మహిళ కృతజ్ఞతలు తెలిపింది.

కాగా, రెండు వారాల క్రితం ఈ ఘటన చోటు చేసుకోగా.. ఇప్పుడు వైరల్ గా మారింది. స్ట్రింగర్, ఏఎన్ఎం పై ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు, నెటిజన్లు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..