Andhra Pradesh: నోరు పండుతుందని కిళ్లీ వేసుకుంటే.. ప్రాణాలే పోయాయి.. షాకింగ్ ఇన్సిడెంట్..

|

Oct 22, 2022 | 7:17 PM

భారతీయ సంప్రదాయంలో తమలపాకులకు చాలా ప్రధాన్యత ఉంది. శుభకార్యాలు, వేడుకలు, పూజలు, పర్వదినాలు.. ఇలా అకేషన్ ఏదైనా సరే తమలపాకులను ఉపయోగించడం కామన్. అంతే కాకుండా ఆకులకు సున్నం రాసి, వక్కలు...

Andhra Pradesh: నోరు పండుతుందని కిళ్లీ వేసుకుంటే.. ప్రాణాలే పోయాయి.. షాకింగ్ ఇన్సిడెంట్..
Betel Leaf
Follow us on

భారతీయ సంప్రదాయంలో తమలపాకులకు చాలా ప్రధాన్యత ఉంది. శుభకార్యాలు, వేడుకలు, పూజలు, పర్వదినాలు.. ఇలా అకేషన్ ఏదైనా సరే తమలపాకులను ఉపయోగించడం కామన్. అంతే కాకుండా ఆకులకు సున్నం రాసి, వక్కలు వేసుకుని కిళ్లీలా చుట్టుకుని తినడం చాలా మందికి అలవాటు. మరికొందరు భోజనం చేసిన తర్వాత కిళ్లీ వేసుకుంటుంటారు. ఇలా చేయడం వల్ల భోజనం త్వరగా జీర్ణం అవడంతో పాటు, తమలపాకులోని అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. ఈ క్రమంలో కిళ్లీ వేసుకున్న ఇద్దరు వ్యక్తులు కొద్ది సేపటికే ప్రాణాలు కోల్పోయారు. వారు వరసకు బావ, బావ మరుదులు కావడం ఆ కుటుంబంలో మరింత విషాదం నింపింది.

అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం గుండావారిపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులు వరసకు బావ, బావ మరుదులు. వీరిద్దరూ భోజనం చేసిన తర్వాత తమలపాకులో సున్నం, వక్కలు వేసుకుని కిళ్లీలా వేసుకున్నారు. అయితే కొంత సమయం తర్వాత వారిద్దరూ ఆకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయారు. భోజనం చేసిన తర్వాత బావ, బావమరిది తాంబులం వేసుకున్నారు. వెంటనే ఒక్కసారిగా వాంతులు చేసుకున్నారు. పరిస్థితి విషమించి బావ కృష్ణమూర్తి మృతి చెందగా.. స్పగ్రామానికి చేరుకున్న బావ మరిది కనక రాజు చనిపోయాడు.

కిళ్లీ వేసుకున్న తర్వాత ఇద్దరు వ్యక్తులు చనిపోవడం ఆ గ్రామంలో హాట్ టాపిక్ గా మారింది. తాంబూలం వేసుకున్నందునే చనిపోయారా.. లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్నారు. మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఒకే కుటుంబలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..