AP Crime: కారును తప్పించబోయి ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు దుర్మరణం

ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి.. ట్రాక్టర్ బోల్తా పడింది. ప్రకాశం(Prakasam) జిల్లా చీమకుర్తి మండలం నెకునంబాదు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ప్రమాదవశాత్తు వాగులో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో కొలకలూరి ఇర్మియా,...

AP Crime: కారును తప్పించబోయి ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు దుర్మరణం
Accident

Updated on: Apr 20, 2022 | 8:34 PM

ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి.. ట్రాక్టర్ బోల్తా పడింది. ప్రకాశం(Prakasam) జిల్లా చీమకుర్తి మండలం నెకునంబాదు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ప్రమాదవశాత్తు వాగులో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో కొలకలూరి ఇర్మియా, కొలకలూరి జశ్వంత్ అక్కడికక్కడే మృతి చెందారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇటుకలు తీసుకువచ్చేందుకు వెళ్లి.. సరకును లోడ్ చేసి ఇంటికి తీసుకువస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నెకునంబాదు వాగు వద్ద ఎదురుగా వచ్చే కారును తప్పించబోయి పక్కనే ఉన్న లోయలో ట్రాక్టర్ బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరు గురించి ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇల్లు కట్టుకుంటున్న సంతోష సమయంలో ఇలా జరగడంపై కన్నీరుమున్నీరుగా విలపించారు.

Also Read

Viral Photo: ఈ ఫోటోలో ఎన్ని జంతువులు దాగున్నాయో చెప్పగలరా.? చాలా కష్టం!

Home Remedies: ఇంట్లో చీమల సమస్యతో ఇబ్బందులు పడుతున్నారా ? ఈ పద్ధతులు పాటిస్తే బెటర్..

Eluru: నువ్వంటే నాకిష్టం.. నీతో ఉండాలనిపిస్తుంది.. మహిళా వాలంటీర్ పై సర్పంచ్ భర్త వేధింపులు