Andhra News: శ్రీశైలంలో ఆకస్మిక తనిఖీలు.. దొరికినవి చూసి అధికారులు షాక్..

|

Jan 03, 2025 | 6:16 PM

మీకు ఇంద్రజాల, మహేంద్రజాల మొక్కల గురించి తెలుసా..? వీటిని ను బ్లాక్, సాఫ్ట్ కోరల్స్‌గా పిలుస్తుంటారు. ఇవి అరుదైన సముద్ర జాతి మొక్కలు. ప్రస్తుతం ఇవి అంతరించిపోయే దశలో ఉన్నాయి. వీటిని అమ్మకాలు, కొనుగోళ్లు జరపడం నేరం. అసలు వీటిని కొందరు ఎందుకు కొనుగోలు చేస్తారో తెలుసుకుందాం పదండి...

Andhra News: శ్రీశైలంలో ఆకస్మిక తనిఖీలు.. దొరికినవి చూసి అధికారులు షాక్..
Indrajal Plant
Follow us on

పైన ఫోటోలో ఉన్నవి చూశారా…! ఏంటివి…? హే పడిపోయిన పిచ్చుక గూడో… లేదంటే వెట్‌ గ్రాస్‌ కుప్పలుగా పేర్చి ఉంచార్లే అనుకుంటున్నారా…? చూస్తుంటే అలానే అనిపిస్తోంది కూడా. కానీ అస్సల్ కానే కాదు. ఇవి సముద్ర గర్భంలో లభించే అరుదైన కోరల్స్‌ జాతికి చెందిన మొక్కలు. ఈ మొక్కలను ఇంద్రజాల, మహేంద్రజాల మొక్కలుగా పిలుస్తారు. అవునా… నిజమా అనుకుంటున్నారా…! నిజమే. కాకపోతే ఇవి చనిపోయిన తర్వాత బయటకు తీసుకొచ్చినవి.  అవి బతికి ఉన్నప్పుడు ఎంతో చక్కగా.. అందంగా ఉంటాయి. చనిపోయిన తర్వాత ఇలా అయిపోతాయి.

సముద్ర గర్భంలో ఉండే ఈ ఇంద్రజాల, మహేంద్రజాల మొక్కలకు ఆకర్షణ శక్తి ఉంటుంది. సముద్రంలో తిరిగే కీటకాలను ఈ మొక్కలు ఆకర్షిస్తాయి. కొన్ని సంవత్సరాల తర్వాత పగడాలుగా తయారవుతాయట. అందుకే వీటికి మార్కెట్‌లో మామూలు డిమాండ్‌ ఉందడు. వీటిని బయట అమ్మితే క్రైమ్‌ కూడా. ఇప్పుడీ ఇంద్రజాల, మహేంద్రజాల మొక్కలే శ్రీశైలంలో DRI అధికారుల ఆకస్మిక తనిఖీల్లో బయటపడటం చర్చనీయాంశమైంది. తాజాగా ఇంద్రజాల, మహేంద్రజాల మొక్కలను అమ్ముతున్న ఇద్దర్ని DRI అధికారులు అరెస్ట్‌ చేశారు. ఎక్కడి నుంచి వచ్చాయి…? ఎలా వచ్చాయి…? అన్నదానిపై ఆరా తీస్తున్నారు. ఇద్దరిపైనా వైల్డ్‌ లైఫ్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేశారు.

అసలింతలా ఈ మొక్కల్లో ఏముంది…? వీటికున్న డిమాండ్‌ ఏంటి…? వైల్డ్‌ లైఫ్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదయ్యేంత సీన్‌ ఈ మొక్కలకుందా…? తెలుసుకుందాం పదండి.  ఈ ఇంద్రజాల, మహేంద్రజాల మొక్కలను నరదిష్టి తగలకుండా తాయిత్తుల తయారీకి వాడతారట.
ఆర్ధిక బాధల నుంచి విముక్తి కలిగించేందుకు ఫ్రేమ్స్‌ చేసి పెట్టుకుంటారు.  దంపతుల మధ్య గొడవలు రాకుండా ఇంట్లోనూ పెట్టుకుంటారట.
ఇవి ఇంట్లో ఉంటే ఎలాంటి గ్రహదోషాలున్నా తొలగిపోతాయని నమ్ముతారు. తాయత్తుగా చేసుకుని ధరిస్తే… వ్యాపారాభివృద్ధి జరుగుతుందని, సంఘంలో గౌరవమర్యాదలు వస్తాయని, శత్రువులపై విజయాలు సాధిస్తారని, ఉద్యోగంలో రాణిస్తారని నమ్ముతుంటారు. కొన్ని ప్రాంతాల్లో పశుపోషణ, వ్యవసాయం, భారీ యంత్రాలతో పనులు చేసేవాళ్లు వీటిని ఖచ్చితంగా ధరించాల్సిందేనని కూడా నమ్ముతుంతారట. సో అందుకే ఈ ఇంద్రజాల, మహేంద్రజాల మొక్కలకు మార్కెట్‌లో ఫుల్లు డిమాండ్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి