గుంటూరు (Guntur) నగరంలో విషాదం నెలకొంది. ఓ అపార్ట్మెంట్ నిర్మాణం కోసం పునాదుల తవ్వుతుండగా మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. అమరావతి (Amaravati) రోడ్డులోని ముత్యాలరెడ్డి నగర్‌లో ఈ దుర్ఘటన జరిగింది. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వైద్య చికిత్స కోసం గాయపడ్డవారని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారు బిహార్ (Bihar) కు చెందిన వలస కూలీలుగా గుర్తించారు. సెల్లార్ పునాదుల కోసం యంత్రాలతో 40 అడుగుల మేర తవ్వకాలు చేపడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ నిశాంత్ కుమార్ స్పందించారు. జీ-ప్లస్ 6 భవన నిర్మాణానికి దరఖాస్తు చేశారని, ప్లానింగ్‌లో లోపాలు ఉండటంతో అందుకు అనుమతులు ఇవ్వలేదని వెల్లడించారు. లోపాలు సరిచేసే వరకు పనులు ఆపాలని యాజమాన్యానికి సూచించామని కానీ.. వారు మొండిగా వ్యవహరించడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు.
కార్పొరేషన్ అనుమతి లేకుండా సెల్లార్ నిర్మాణానికి పనులు చేపట్టారని గుంటూరు మేయర్ మనోహర్‌నాయుడు అన్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఘటన దురదృష్టకరమని చెప్పారు. దీనికి బాధ్యులైన యాజమాన్యం, అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Also Read
Nail Biting Habit: మీకు కూడా గోళ్లు కొరికే అలవాటు ఉందా? ఈ అలవాటును ఎలా వదిలించుకోవాలో తెలుసా..
Anchor Suma Kanakala: యాంకర్ సుమ కొడుకును చూశారా ?.. హీరోకు ఏమాత్రం తీసిపోడు..