పక్షుల బెడద నుంచి కాపాడుకునేందుకు పెట్టిన వలలో పాములు చిక్కుతున్నాయి. చిక్కుకొని బుసలు కొడుతూ భయపెడుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో ఒకే చోట రెండు విషపూరితమైన పాములు కనిపించడంతో వణికిపోతున్నారు జనం. స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లో అత్యంత విషపూరితమైన రక్తపింజర పాము కనిపించింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ సెక్టార్లో రక్త పింజర పాము కలకలం రేపింది. వలలో చిక్కుకొని ఉన్నా భుసలు కొడుతూ భయపెట్టింది. భుసలు శబ్దం విని చూసేసరికి వలలో చిక్కుకొని భారీ రక్తపింజర కనిపించింది అక్కడ వాళ్ళకు. పక్షులు రాకుండా ఉండేందుకు వినియోగించిన వలలో చిక్కుకుని విలవిలాడుతోంది ఆ పాము. స్టీల్ ప్లాంట్ సెక్టార్ 11 క్వార్టర్ 111 లో ఈ ఘటన జరిగింది. మరి కాస్త ఆలస్యం అయితే ఆ పాము ప్రాణాలు కోల్పోయేది. కాపాడుదాం అనుకుంటే బుసలు కొడుతోంది.. అత్యంత విషపూరితమైన ఈ పాము ఒకవేళ కాటేస్తే అక్కడికక్కడే కుప్పకూలి పోవాల్సిందే. దీంతో ఇక చేసేది లేక.. స్నేక్ కేచారుకు సమాచారం అందించడంతో.. రంగంలో దిగిన దిగిన పాములు పట్టే నేర్పరి కిరణ్., అయిదడుగుల రక్తపింజర ను సురక్షితంగా వల నుంచి బయటకు తీశాడు. ఆ పామును సురక్షిత ప్రాంతానికి తరలించారు. దీంతో స్థానికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
రక్తపింజర అత్యంత విషపూరితమైనది. దీనిని రసల్స్ వైపర్ అంటారు. కాటుక రేకుల పాము అని కూడా పిలుస్తారు. దూకుడు స్వభావం ఉండే ఈ పాము వెరీ డేంజరస్. ఈ పాము కాటేస్తే అంతర్గతంగా రక్తస్రావం జరిగి ప్రాణాపాయానికి దారితీస్తుంది. దేశంలో అత్యధిక పాము కాటు మరణాల కారణమైన నాలుగు అత్యంత విషపూరిత పాముల్లో ఇదొకటి. విశేషం ఏంటంటే సరిగ్గా వారం క్రితం.. ఈ రక్తపింజర కనిపించిన చోట భారీ గోధుమ నాగు ను రెస్క్యూ చేశారు. అది కూడా వలలోనే చిక్కుకొని విలవిల్లాడుతుండగా స్నేక్ కేసర్ కిరణ్ సురక్షితంగా రెస్క్యూ చేశారు. సపర్యాలు చేసి సురక్షితంగా అడవుల్లో విడిచిపెట్టారు.