Andhra Pradesh: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు ఏనుగులు మృతి చెందాయి.. అసలు ఏం జరిగిందంటే..

| Edited By: Jyothi Gadda

Nov 08, 2023 | 10:06 AM

chittoor distirct: గంటావారి పల్లె సమీపంలోని పంట పొలాల్లో ఏనుగు విద్యుత్ షాక్ కు గురైంది. వెంకట స్వామి అనే రైతు పొలంలో విద్యుద్ఘాతానికి గురైన ఏనుగు ట్రాన్స్ ఫార్మర్ ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగినట్లు అటవీ శాఖ సిబ్బంది భావిస్తోంది. గత కొన్ని రోజులుగా సదుం మండలంలోని పంట పొలాల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపు నుంచి విడిపోయిన ఏనుగే విద్యుత్ షాక్ కు గురై మృతి చెందినట్లు అటవీ శాఖ భావిస్తోంది.

Andhra Pradesh: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు ఏనుగులు మృతి చెందాయి.. అసలు ఏం జరిగిందంటే..
Two Elephants Dies
Follow us on

చిత్తూరు జిల్లా, నవంబర్08; తిరుపతి ఎస్వీ జూపార్క్ లో అటవీ శాఖ రెస్క్యూ చేసిన ఏనుగు మృతి చెందగా మరో ఏనుగు సదుం మండలంలోని పంట పొలాల్లో విద్యుత్ షాక్కు గురై మృతి చెందింది. తిరుపతి ఎస్వీ జూ పార్కులో 17 ఏళ్ల మగ ఏనుగు మృతి చెందినట్లు జూ పార్క్ యంత్రాంగం స్పష్టం చేసింది. గత ఆగస్టు చివరి వారంలో చిత్తూరు- తమిళనాడు సరిహద్దులో పంట పొలాల పై దాడులు చేసి ముగ్గురు రైతుల మృతికి ఏనుగు కారణమైంది. రెండు నెలల క్రితం చిత్తూరు రూరల్ మండలం కట్టకిందపల్లి వద్ద ఏనుగును రెస్క్యూ చేసిన అటవీ శాఖ తిరుపతి ఎస్వీ జూకు తరలించింది. ఏనుగును బంధించిన రెస్క్యూటీం అటవీశాఖ ఎస్వీ జూ వైద్యుల పర్యవేక్షణలో ఉంచింది.

గాయాలతో చికిత్స పొందుతున్న ఏనుగు నిన్న మృతి చెందింది. జూ లోని సంరక్షణ కేంద్రంలో ఉన్న గోడలు, చెట్లను తొండంతో కొట్టుకుని ఈ ఏనుగు గాయపడిందని చెప్పారు. అయితే, గాయం నయం కాలేదని, చికిత్స పొందుతూనే ఏనుగు మృతి చెందినట్లు జూ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

మరోవైపు, సదుం మండలం గంటావారి పల్లె సమీపంలోని పంట పొలాల్లో ఏనుగు విద్యుత్ షాక్ కు గురైంది. వెంకట స్వామి అనే రైతు పొలంలో విద్యుద్ఘాతానికి గురైన ఏనుగు ట్రాన్స్ ఫార్మర్ ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగినట్లు అటవీ శాఖ సిబ్బంది భావిస్తోంది. గత కొన్ని రోజులుగా సదుం మండలంలోని పంట పొలాల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపు నుంచి విడిపోయిన ఏనుగే విద్యుత్ షాక్ కు గురై మృతి చెందినట్లు అటవీ శాఖ భావిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..