Tirumala: అసలు తిరుమలలో AI దర్శన వివాదం ఏంటి..? ఎవరు ఏం చెబుతున్నారు.. పూర్తి వివరాలు

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తున్నారా? అయితే ఈసారి మీ దర్శనం రెండు మూడు గంటల్లోనే అయిపోవచ్చు. దీనికి కారణం ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌. ఇప్పటికే ప్రపంచం ఏఐ సంచలనాలను చూస్తోంది. ప్రతీ రంగంలో ఏఐ వాడకం పెరిగిపోయింది. ఇప్పుడు టీటీడీ కూడా ఏఐని వాడుకుని భక్తులకు సేవలు అందించేందుకు రెడీ అయింది. రెండు ప్రపంచస్ధాయి సంస్థలతో చర్చలు జరుపుతోంది. టోటల్‌గా ఏడుకొండలు ఏఐతో సంచలన మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది.

Tirumala: అసలు తిరుమలలో AI దర్శన వివాదం ఏంటి..? ఎవరు ఏం చెబుతున్నారు.. పూర్తి వివరాలు
TTD Tech Initiative

Edited By: Ram Naramaneni

Updated on: Aug 04, 2025 | 8:16 PM

ఎంత ముగ్ధమనోహరము. ఎంత సుందర దృశ్యం. ఆ ఏడుకొండల వాడిని ప్రత్యక్షంగా చూడడమంటే.. అది కేవలం దైవదర్శనం మాత్రమే కాదు.. మన జీవితాలకు పునః ప్రారంభము కూడా. అందుకే ప్రతీ ఏటా తప్పకుండా తిరుమలకు వెళ్లివచ్చే వారుంటారు. ఒంటరిగానో.. కుటుంబంతోనో.. వెళ్తుంటారు. సెలవుల్లోనో.. పర్వదినాల్లోనో దర్శించుకుంటుంటారు. అయితే కొన్నిసార్లు అందరికీ టికెట్లు దొరకవు. వీఐపీ దర్శనాలు ప్రతీ ఒక్కరికీ సాధ్యాం కావు. ఫ్రీ దర్శనాల నుంచి 300 రూపాయల టికెట్లు, సేవా దర్శనాలు..వీఐపీ టికెట్లు ఇలా ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. కొందరు కాలినడకన దివ్యదర్శనం చేసుకుంటే.. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ దగ్గర టికెట్లు తీసుకుని వెళ్లే వారు కూడా ఉన్నారు. తిరుమల వెళ్తే అక్కడ భక్తులను మోసం చేయడానికి ఒక బ్యాచ్‌ రెడీగా ఉంటుంది. ఈ మధ్య టికెట్లు ఇప్పిస్తానని చెప్పి కొందరు దళారులు భక్తులు ఒక్కొక్కరి దగ్గర్నుంచి 1500 రూపాయలు వసూలు చేసి.. అక్రమ మార్గంలో వారిని క్యూలైన్లలోకి తీసుకెళ్లారు. ఈ బండారం బయటపడడంతో చాలామంది అక్కడే నిలువుదోపిడీకి గురయ్యారు. ఇక కొందరు ఫేక్‌ టికెట్లను భక్తులకు అమ్ముతూ వారిని మోసం చేస్తున్నారు. మరికొందరు ఫేక్‌ వీఐపీ పాసులను సైతం అమ్ముతున్నారు. ఇలాంటి వాటికి చెక్‌ పెట్టేందుకు టీటీడీ ఒక పెద్ద స్టెప్‌ తీసుకుంది. గత నెల 22న జరిగిన బోర్డ్ మీటింగ్‌లో TTD పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. AI ద్వారా భక్తులకు త్వరగా దర్శనం కల్పించేలా చేయాలని చూస్తోంది టీటీడీ. దీనికోసం...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి