వచ్చే ఏడాదికి కాణిపాక వినాయకుడికి ‘బంగారు రథం’: టీటీడీ

చిత్తూరు జిల్లాలోని కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయకుడి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌లు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ..

వచ్చే ఏడాదికి కాణిపాక వినాయకుడికి 'బంగారు రథం': టీటీడీ
Follow us

| Edited By:

Updated on: Aug 30, 2020 | 4:52 PM

చిత్తూరు జిల్లాలోని కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయకుడి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌లు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ.. వచ్చే వార్షిక బ్రహ్మోత్సవాల నాటికి వినాయకుడికి బంగారు రథం తయారు చేయిస్తామన్నారు. బంగారు తయారీకి కాణిపాకం ఆలయం కోటి రూపాయలు ఇచ్చింది. కానీ బంగారు రథం తయారీకి రూ.5 కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు అనిల్ కుమార్.

కాగా ఆగష్టు 23వ తేదీన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ రోజు ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ధ్వజస్తంభంపై ఉన్న మూషిక పటానికి ప్రత్యేక పూజలు చేసి ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. తర్వాత మూషిక పటాన్ని ధ్వజ స్తంభంపైకి ఎగురవేసి బ్రహ్మాది దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. తర్వాత ధ్వజ స్తంభంపై ఉన్న వినాయక స్వామివారి పటానికి పాలు, తేనె, పెరుగు, పంచదార పోసి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా ఏటా స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండగలా జరిగేవి. కానీ ఈ ఏడాది కరోనా మహహ్మారి దృష్ట్యా.. ఉత్సవాలు ఆలయం వరకే పరిమితమయ్యాయి.

Read More:

ఆసియాలో ఫస్ట్ టైం: కోవిడ్ రోగికి ఊపిరితిత్తుల మార్పిడి

ఇంకా డీప్‌ కోమాలోనే ప్రణబ్.. వెంటిలేటర్ మీద చికిత్స

బ్రేకింగ్: ఎంపీ అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్

అన్నదాతలే మనకి గర్వకారణం.. ‘మన్‌కీ బాత్’లో ప్రధాని

ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
నైల్ ఆర్ట్ తో గోరును టీ స్ట్రైనర్ చేసిన యువతి..
నైల్ ఆర్ట్ తో గోరును టీ స్ట్రైనర్ చేసిన యువతి..