TTD News: విపత్తుల నిర్వహణకు టీటీడీ కీలక నిర్ణయం.. ఇకపై ప్రకృతి విపత్తులు సంభవించిన వెంటనే..

TTD News: ఇటీవల తిరుమలలో కురిసిన భారీ వర్షం ఎంతటి నష్టాన్ని మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తిరుమల గిరుల్లో కొండ చరియలు విరిగి పడడంతో ఘాట్‌ రోడ్‌ ధ్వంసమైంది. దీంతో..

TTD News: విపత్తుల నిర్వహణకు టీటీడీ కీలక నిర్ణయం.. ఇకపై ప్రకృతి విపత్తులు సంభవించిన వెంటనే..

Updated on: Dec 22, 2021 | 7:09 PM

TTD News: ఇటీవల తిరుమలలో కురిసిన భారీ వర్షం ఎంతటి నష్టాన్ని మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తిరుమల గిరుల్లో కొండ చరియలు విరిగి పడడంతో ఘాట్‌ రోడ్‌ ధ్వంసమైంది. దీంతో లింక్‌ రోడ్డుతో భక్తులకు తిరుమలకు వెళ్లడానికి అధికారులు అవకాశం కల్పించారు. అయితే అంతలోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో ఇకపై అలాంటి పరిస్థితులు పునారవృతం కాకూడదని టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

వ‌ర‌ద‌లు, కొండ‌చ‌రియ‌లు విరిగి ప‌డ‌డం లాంటి ప్రకృతి విప‌త్తులు సంభవించిన‌పుడు వెంట‌నే స్పందించి భారీ న‌ష్టం జ‌ర‌గ‌కుండా త‌గిన చ‌ర్యలు చేప‌ట్టేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఇందుకు వీలుగా విప‌త్తుల నిర్వహ‌ణ మాన్యువల్ రూపొందిస్తున్నట్టు టిటిడి జెఈవో స‌దా భార్గవి తెలిపారు. విప‌త్తులు సంభ‌వించిన‌పుడు శ్రీ‌వారి భ‌క్తుల‌కు స‌రైన స‌మాచారంతోపాటు మ‌నోధైర్యం క‌ల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ విషయమై బుధవారం తిరుప‌తిలోని శ్వేత భ‌వ‌నంలో అధికారుల‌తో స‌మీక్ష సమావేశంలో నిర్వహించారు. ఈవో డాక్టర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి స‌మీక్ష నిర్వహించి విప‌త్తుల నిర్వహ‌ణ‌కు త‌గిన మార్గద‌ర్శకాలు రూపొందించాల‌ని సూచించార‌ని భార్గవి తెలిపారు.

ఈవో ఆదేశాల మేర‌కు అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి ఆధ్వర్యంలో ఒక క‌మిటీ ఏర్పాటు చేశామన్నారు. ఇందులో టీటీడీ జేఈఓ వీర‌బ్రహ్మం, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వర‌రావు, డిఎఫ్‌వో శ్రీ‌నివాసులురెడ్డి స‌భ్యులుగా ఉంటార‌ని తెలిపారు. విప‌త్తుల నివార‌ణ కోసం మాన్యువ‌ల్ త‌యారీని తాను పర్యవేక్షిస్తున్నామని, ఇందుకోసం వ‌ర్కింగ్ గ్రూపు ఏర్పాటు చేశామ‌ని చెప్పారు. ఈ గ్రూపులోని ఇంజినీరింగ్, ఫారెస్టు, ఐటి, ఎల‌క్ట్రిక‌ల్‌, సెక్యూరిటీ, హెల్త్ విభాగాల అధికారులతో స‌మీక్ష నిర్వహించిన‌ట్టు తెలిపారు. కంట్రోల్ రూమ్ ప్రారంభం, ముంద‌స్తు హెచ్చరిక‌లు చేసే యంత్రాంగంపై స‌మీక్ష నిర్వహించిన‌ట్టు సదా భార్గవి తెలిపారు.

Also Read: Year Ender 2021: ఈ ఏడాది ఎన్నికల్లో అధికార పార్టీదే హవా.. ఉప ఎన్నిక నిరాశపర్చినా.. ఎమ్మెల్సీల్లో కారుదే జోరు

Myanmar Landslide: మయన్మార్‌లో ఘోర ప్రమాదం.. మైనింగ్‌ సైట్‌లో విరిగిపడిన కొండ చరియలు.. 70 మంది గల్లంతు..

Lockdown In India: డిసెంబర్ 31stన లాక్ డౌన్ తప్పదా ?? నిపుణులు ఏమంటున్నారు ?? లైవ్ వీడియో