Tirumala: అదిగో చిరుత.. ఇదిగో స్మార్ట్‌ స్టిక్‌.. ఆన్ చేశారంటే మీరు ఇక సేఫ్

ఓ ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది. TTD ఐడియా మాత్రం భక్తులకు రక్షణ కల్పిస్తోంది. తిరుమల శ్రీవారి భక్తుల భద్రతకు ఇక ఢోకా లేదు. వారికి చిరుతల నుంచి భయం లేదు. వాళ్లకు రక్షణ కల్పించేందుకు TTD వేసిన ఐడియా ఏంటో చూద్దాం.

Tirumala: అదిగో చిరుత.. ఇదిగో స్మార్ట్‌ స్టిక్‌.. ఆన్ చేశారంటే మీరు ఇక సేఫ్

Updated on: May 30, 2025 | 10:16 PM

కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తుల రక్షణ కోసం స్మార్ట్‌ స్టిక్స్‌ అందుబాటులోకి తెచ్చింది TTD. నడక మార్గం ఇరువైపులా కెమెరా ట్రాప్‌లు, స్టాటిక్ కెమెరాలు, మోషన్ సెన్సార్ కెమెరాలను వినియోగిస్తోంది. వన్యమృగాల బెడదకు చెక్ పెట్టేలా స్మార్ట్ స్టిక్స్ వినియోగిస్తోంది. భక్తులకు రక్షణగా వచ్చే సెక్యూరిటీ సిబ్బంది కోసం ఈ స్మార్ట్ స్టిక్స్ కొనుగోలు చేసింది. స్మార్ట్ స్టిక్స్‌లో ఉండే టార్చ్ అటవీ జంతువుల కదలికలను గుర్తిస్తుంది. అందులో ఉండే అలారం ఆన్‌ చేస్తే, జంతువులు భయపడి తిరిగి అడవిలోకి వెళ్లిపోతాయంటున్నారు టీటీడీ సిబ్బంది. అడవి జంతువులు మనుషుల సమీపంలోకి వచ్చినప్పుడు స్మార్ట్ స్టిక్‌కు ఉన్న బటన్‌ నొక్కుతారు టీటీడీ సిబ్బంది. ఇందులోని అలారం మోగితే జంతువులు పరుగులు పెడతాయి. చిరుత లాంటి క్రూర మృగాలు మరీ దగ్గరకు వస్తే, వాటికి షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చే ఫెసిలిటీ కూడా ఈ స్మార్ట్‌ స్టిక్‌లో ఉంది.

అలిపిరి నడక మార్గంలో ఏడో మైలు నుంచి నరసింహస్వామి గుడి వరకు చిరుతల సంచారం ఉంటుంది. గతంలో కూడా అక్కడే చిరుతల దాడులు జరిగాయి. 20 స్మార్ట్‌ స్టిక్‌లతో ఈ ప్రాంతంలో టీటీడీ సిబ్బంది పహారా కాస్తారు. సాయంత్రం 6 కాగానే,టీటీడీ సిబ్బంది స్మార్ట్‌ స్టిక్‌లు ధరించి, అలిపిరి మెట్ల మార్గంలో ఏడో మైలు దగ్గరకు చేరుకుంటారు. శ్రీవారి భక్తుల బృందాలకు నరసింహ స్వామి గుడి దాకా తోడు వస్తారు. మూడు బ్యాచ్‌ల భక్తులకు, ప్రతి నిత్యం ఇలా రక్షణ కల్పిస్తారు. మరో 20 స్మార్ట్‌ స్టిక్‌లను సిబ్బందికి అందుబాటులోకి తేనుంది టీటీడీ.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..