Andhra Weather: ద్రోణి ఎఫెక్ట్.. ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

దక్షిణ చత్తీస్‌గఢ్‌ నుండి మన్నార్‌ గల్ఫ్‌ వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Andhra Weather: ద్రోణి ఎఫెక్ట్.. ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
Andhra Weather Report

Updated on: Oct 08, 2025 | 8:05 PM

దక్షిణ చత్తీస్‌గఢ్ నుండి మన్నార్ గల్ఫ్ వరకు, తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్లు ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రెండు రోజులపాటు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

గురువారం(09-10-25):  అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

బుధవారం సాయంత్రం 4 గంటలకు తిరుపతి(జి) దక్కిలిలో 77.2మిమీ, అల్లూరి(జి) అరకులో 61మిమీ, నెల్లూరు(జి) దగదర్తిలో 57.7మిమీ, బాపట్ల(జి)రామకూరులో 56.5మిమీ, అనకాపల్లి(జి) పాములవాకలో 48.5మిమీ, కడప(జి) పులివెందులలో 45.5మిమీ వర్షపాతం నమోదైందన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..