AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ కుటుంబంలో లేక లేక ఆరేళ్లకు పుట్టిన కొడుకు.. స్కూల్ బస్సు దిగాడు.. అంతలోనే..

బస్ లో క్లీనర్ లేకపోవడంతో బాలుడు జితేంద్ర దిగడం చూసుకోకుండా డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును ముందుకు పోనిచ్చాడు.. దీంతో బస్సు టైరు బాలుడు తలపైకి ఎక్కింది.. దీంతో అక్కడికక్కడే కుప్పుకూలాడు జితేంద్ర.. తీవ్రగాయాలైన చిన్నారి అక్కడికక్కడే మరణించడంతో వెదురుపాక గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

ఆ కుటుంబంలో లేక లేక ఆరేళ్లకు పుట్టిన కొడుకు.. స్కూల్ బస్సు దిగాడు.. అంతలోనే..
Tragic School Bus Accident
Pvv Satyanarayana
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Feb 17, 2025 | 1:21 PM

Share

తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం, వెదురుపాకలో దారుణం జరిగింది. కోరుకొండ మండలం రాఘవపురంలో మూడేళ్ల చిన్నారిపై ప్రైవేట్ స్కూల్ బస్సు ఎక్కించిన ఘటన మరువక ముందే.. మరో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రయివేట్ స్కూల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యనికి 5ఏళ్ల LKG విద్యార్ది కుంచె జితేంద్ర అనే బాలుడు మృతి చెందాడు. పెళ్లయిన ఆరేళ్లకు లేక లేక పుట్టిన తమ కుమారుడు కళ్ళ ముందే చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.స్థానిక కోరుకొండలోని సిద్దార్ద స్కూల్‌లో బాలుడు జితేంద్ర ఎల్‌కేజీ చదువుతున్నాడు.. పాఠశాలకు స్కూల్ బస్సులోనే వెళ్తున్నాడు.. అయితే.. రోజువారీ షెడ్యూల్ భాగంగా యధావిధిగా బస్సులోనే పిల్లల్ని దింపుకుంటూ వెదురుపాక చేరుకున్నాడు బస్సు డ్రైవర్..

అయితే.. బస్ లో క్లీనర్ లేకపోవడంతో బాలుడు జితేంద్ర దిగడం చూసుకోకుండా డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును ముందుకు పోనిచ్చాడు.. దీంతో బస్సు టైరు బాలుడు తలపైకి ఎక్కింది.. దీంతో అక్కడికక్కడే కుప్పుకూలాడు జితేంద్ర.. తీవ్రగాయాలైన చిన్నారి అక్కడికక్కడే మరణించడంతో వెదురుపాక గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

బాలుడు మృతితో కుటుంబమంతా శోకసంద్రం మునిగిపోయింది.. ముగ్గురు అన్నదమ్ములు ఉన్న ఈ కుటుంబంలో అందరికీ ఆడపిల్లలే ఉండడం.. వాళ్లలో ఆరేళ్లకు లేకలేక పుట్టిన ఒకే ఒక్క మగ బిడ్డ అయిన జితేంద్ర మృతితో కుటుంబమంతా శోకసంద్రంలో మునిగింది. మరో 15 రోజుల్లో బాబు జితేంద్ర పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని కుటుంబ సభ్యులంతా ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో బాలుడు మృత్యువు ఒడికి చేరాడు..

అనుమతులు లేకపోయినా..

గతంలో కూడా డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటనలు చాలా జరిగినా స్కూల్ యాజమాన్యం పట్టించుకోకపోవడం లేదని గ్రామస్థులు పేర్కొంటున్నారు. అడపాదడ అనుమతులతో గోకవరం, కోరుకొండ ప్రాంతాల్లో కనీసం పదో తరగతి కూడా పాస్ అవని టీచర్లనుగా పెట్టుకుని ఫిట్నెస్ లేని వాహనాలు నడుపుతూ కనీసం సేఫ్టీ లేకుండా విద్యార్థులను జీవితాలతో చెలగాటమాడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఫిటినెస్ లేని బస్సుల్లో పరిమితికి మించి విద్యార్థులు ఎక్కిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని.. అధికారులు ఇప్పటికైనా స్పందించాలని సూచిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..