Andhra Pradesh: కార్తీక పుణ్య స్నానాలకు వెళ్లి.. అనంత లోకాలకు.. కృష్ణా, విశాఖ జిల్లాల్లో విషాదం

|

Nov 15, 2021 | 10:02 AM

విశాఖ, కృష్ణా జిల్లాలో కార్తీక పుణ్య స్నానాల్లో అప శృతి చోటు చేసుకుంది. పుణ్య స్నానాల కోసం నదిలోకి దిగి నలుగురు గల్లంతు అయ్యారు.

Andhra Pradesh: కార్తీక పుణ్య స్నానాలకు వెళ్లి.. అనంత లోకాలకు..  కృష్ణా, విశాఖ జిల్లాల్లో విషాదం
Drowned
Follow us on

విశాఖ, కృష్ణా జిల్లాలో కార్తీక పుణ్య స్నానాల్లో అప శృతి చోటు చేసుకుంది. పుణ్య స్నానాల కోసం నదిలోకి దిగి నలుగురు గల్లంతు అయ్యారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం తోటవల్లూరులో విషాదం చోటు చేసుకుంది. కృష్ణానదిలో ముగ్గురు గల్లంతు అయ్యారు. కార్తీక సోమవారం కార్తీక స్నానాలు చేసేందుకు ముగ్గురు యువకులు నరేంద్ర, నాగరాజు, పవన్‌ నదిలోకి దిగారు. నీటి ప్రవాహం గమనించకపోవడంతో ముగ్గురు యువకులు కొట్టుకుపోయారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గల్లంతైనవారిలో ఇద్దరి మృతదేహాలు దొరికాయి. మరో యువకుడి డెడ్‌బాడీ కోసం గాలిస్తున్నారు. విశాఖ జిల్లా గోస్తని నదిలో స్నానానికి దిగి తొమ్మిదేళ్ల బాలుడు గల్లంతు అయ్యాడు. పద్మనాభం మండలం పాండ్రంగిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

కిటకిటలాడుతోన్న ఆలయాలు

కార్తీక మాసం రెండో సోమవారం కావడంతొో ఉభయ తెలుగు రాష్ట్రాలలో భక్తులు ఆలయాలకు పోటెత్తారు. దైవ దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులతో క్యూలైన్లు మొత్తం నిండిపోయాయి. ఆలయంలో కార్తీక దీపాలను వెలిగించి భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు.

Also Read:  విశాఖలో డ్రగ్స్‌ కలకలం.. కార్పొరేట్‌ కాలేజ్‌ విద్యార్థులే టార్గెట్‌‌గా కొకైన్ సప్లై

రాములోరి కంట నీరు.. ముప్పు తప్పదంటున్న భక్తులు