
విజయవాడ, జూలై 30: రైతు మార్కెట్ లో టమోటాలు కనుమరుగై పోయాయి. ఆకాశాన్ని అంటిన టమోటా ధరలతో రైతులు టమోటాలను టచ్ చెయ్యటం మానేశారు. ఒక వేళ కొనాలన్నా కూడా రైతు మార్కెట్ లో బోర్డు ధరకు యార్డ్ లో టమాటాల ధరకు పొంతన లేకుండా పోయిందని గగ్గోలు పెడుతున్నారు. రైతు మార్కెట్ బోర్డు ప్రకారం కిలో టమాటాలు 125 రూపాయలు ఉంటే యార్డ్‌లో 180 రూపాయల వరకు ఉండటంతో ఇక టమోటాలు మార్కెట్ కు తీసుకుని రావటమే మానేశారు . అందరు కలిసి టమాటాలనే బోయికాట్ చేసారు. దాంతో చాల రైతు బజార్లులో అసలు టమోటా జాడే లేకుండా పోయింది. ఇక 50 రూపాయలకు ఇచ్చే సబీసీడీ టమాటాలు కూడా గత వారం నుండి మార్కెట్లలోకి రాకపోవటంతో పబ్లిక్ అల్లాడుతున్నారు.
మరోవైపు కనుమరుగైన టమోటాలతో రిటైల్ మార్కెట్‌లో వ్యాపారాలు దందా షురూ చేసి రెచ్చిపోతున్నారు. రిటైల్ మార్కెట్ లో కేజీ టమోటాలు డబుల్ సెంచరీని దాటేశాయి. అది కూడా అన్ని చోట్లో దొరకటం లేదు. పైగా దొరికిన చోట కూడా మిగతా కూరగాయలు కొంటేనే టమోటాలు అమ్ముతాం అంటున్నారు వ్యాపారాలు. మొన్నటి వరకు 120 రూపాయలు ఉన్న టమోటా గత వరం రోజులుగా అందుకోలేని స్థాయికి వెళ్ళిపోయింది. పెరిగిన టమోటా ధరతో రిటైల్ వ్యాపారాలు పండుగ చేసుకుంటుంటే రైతు మార్కెట్ లో రైతులు టమోటాను బోయెకాట్ చేసారు. దాంతో వంటింటి మహారాణి టమోటో కష్టాలు బెజవాడ వాసులకు తప్పటం లేదు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..