AP News: ఏపీలో భారీగా పడిపోయిన టమోటా ధర.. కిలో ఎంత ఉందో తెలిస్తే మైండ్ బ్లాంకే.!

|

Aug 26, 2023 | 8:45 PM

టమోటా..! మొన్నటి వరకూ ఈ పేరెత్తితేనే సామాన్యులు బెంబేలెత్తిపోయారు. కొండెక్కిన ధరతో సామాన్యుడి ఇంట టమోటా కరువైంది. చూసి సంతోషించడమే తప్ప.. కొనడానికి సాహసం చేయలేని పరిస్థితి నెలకొంది. దేశంలో టమోటా మోత మోగింది. అటు.. నెలలోనే రైతుల్ని కోటీశ్వరులుగా మార్చేసింది.

AP News: ఏపీలో భారీగా పడిపోయిన టమోటా ధర.. కిలో ఎంత ఉందో తెలిస్తే మైండ్ బ్లాంకే.!
Tomato
Follow us on

టమోటా..! మొన్నటి వరకూ ఈ పేరెత్తితేనే సామాన్యులు బెంబేలెత్తిపోయారు. కొండెక్కిన ధరతో సామాన్యుడి ఇంట టమోటా కరువైంది. చూసి సంతోషించడమే తప్ప.. కొనడానికి సాహసం చేయలేని పరిస్థితి నెలకొంది. దేశంలో టమోటా మోత మోగింది. అటు.. నెలలోనే రైతుల్ని కోటీశ్వరులుగా మార్చేసింది. చివరకు టమోటా కోసం హత్యలు, లూటీలు కూడా జరిగాయి. అలా.. రెండు నెలలుగా ఆకాశాన్నంటిన టమోటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఏపీలో కిలో టమోటా ధర కేవలం 10 రూపాయలకు చేరడంతో.. సామాన్యులు ఊపిరి పీల్చుకుంటుంటే.. రైతులు మాత్రం లబోదిబోమంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. దాదాపు రెండు నెలల పాటు టమాటా ధరలు ప్రజలకు ముప్పు తిప్పలు పెట్టాయి. టమాటా ధరలు ఎక్కువగా ఉండటం వల్ల వాటిని కొనేందుకు చాలా మంది వెనకడుగు వేశారు. మరికొందరైతే టమాటాలను వంటల్లో వాడటమే ఆపేశారు. అయితే టమాటాలను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, హర్యాణా రాష్ట్రాల్లో ఎక్కవగా పండిస్తారు. అయితే ఈ రాష్ట్రాల నుంచి సరఫరా పెరగడవ వల్ల ధరలు క్రమంగా దిగివస్తున్నట్లు ఇటీవలే కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ వెల్లడించింది. గత జులై నెలలో కిలో టమాటా ధరలు ఏకంగా 250 రూపాయలు పెరిగాయి. అయితే ప్రస్తుతం టమాటా ధరలు క్రమంగా పలు ప్రాంతాల్లో తగ్గుముఖం పడుతున్నాయి.

ఇప్పుడు ఏపీలో టమోటా ధరలు మళ్లీ పాతాళానికి పడిపోయాయి. పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో రైతులు తొలిరోజే సుమారు 10 టన్నుల సరకు తెచ్చారు. వేలంలో క్వింటాలు టమాటాకు వెయ్యి రూపాయిల కంటే తక్కువ ధరే పలికింది. అంటే.. కిలోకు 10 రూపాయల కూడా దక్కలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అధిక దిగుబడి రావడం వల్ల ధరలు పతనం అవుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. ఇటు మదనపల్లెతో పాటుగా అనంతపురం జిల్లాలోని మార్కెట్‌లో కూడా దాదాపు అదే పరిస్థితి కనిపిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి