Tirumala Tirupati Devasthanams: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. జనవరి 1వ తేదీన సిఫార్సు లేఖల స్వీకరణ ఉండదని స్పష్టం చేసింది. అంతేకాకుండా జనవరి 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కూడా సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసినట్టు టీటీడీ ప్రకటించింది. ఆయా తేదీల్లో స్వయంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించనున్నట్లు, వారి సిఫార్సు లేఖలు ఈ తేదీల్లో అనుమతించమని దేవస్థానం పేర్కొంది. జనవరి 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు వసతి గదుల అడ్వాన్స్ రిజర్వేషన్‌ను కూడా రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. కరోనా పరిస్థితుల దృష్ట్యా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులుకు కరోనా వ్యాక్సినేషన్ లేదా కరోనా నెగటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి అని టీటీడీ మరోసారి స్పష్టం చేసింది.
శ్రీవారి ఆలయంలో జనవరి 13న వైకుంఠ ఏకాదశి, జనవరి 14న వైకుంఠ ద్వాదశి పర్వదినాల సందర్భంగా వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. ఈ పర్వదినాల నేపథ్యంలో జనవరి 13 నుంచి 22 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నట్లు పేర్కొంది. అలాగే దర్శనాలకు వచ్చే సామాన్య భక్తుల వసతికి పెద్దపీట వేసేందుకు తిరుమలలోని అన్ని గదులను కరెంట్ బుకింగ్ ద్వారా కేటాయించాలని నిర్ణయించినట్లు టీటీడీ పేర్కొంది.
Also Read: Singer Mangli: సింగర్ మంగ్లీకి సెల్ఫీల సెగ.. అభిమానులపై సీరియస్.. అసలేం జరిగిందంటే..!
Vangaveeti Radha Issue: వంగవీటి రాధా హత్యకు కుట్ర జరిగిందా? ఆ సంచలన కామెంట్స్ వెనుక ఆంతర్యం ఏంటి?