Tirupati Corporation: తెరపడిన తిరుపతి కార్పొరేషన్‌ కార్యాలయం షిఫ్టింగ్‌ వివాదం

|

Oct 06, 2022 | 9:47 PM

తిరుపతి కార్పొరేషన్‌ ఆఫీస్‌ షిఫ్టింగ్‌ కాంట్రవర్సీకి తెరపడింది. ఇంతకీ, అధికారులు తీసుకున్న నిర్ణయమేంటి? వివాదానికి ఎలా పుల్‌స్టాప్‌ పెట్టారు? ఎట్టకేలకు తిరుపతి మున్సిపల్‌..

Tirupati Corporation: తెరపడిన తిరుపతి కార్పొరేషన్‌ కార్యాలయం షిఫ్టింగ్‌ వివాదం
Tirupati Corporation Office
Follow us on

తిరుపతి కార్పొరేషన్‌ ఆఫీస్‌ షిఫ్టింగ్‌ కాంట్రవర్సీకి తెరపడింది. ఇంతకీ, అధికారులు తీసుకున్న నిర్ణయమేంటి? వివాదానికి ఎలా పుల్‌స్టాప్‌ పెట్టారు? ఎట్టకేలకు తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం తరలింపునకు రూట్‌ క్లియరైంది. డీఎం అండ్‌ హెచ్‌వో ఆఫీస్‌లోకి షిఫ్ట్‌ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఆ మేరకు ఆర్డర్స్‌ జారీ చేశారు. మొదట ఓల్డ్‌ మెటర్నిటీ హాస్పిటల్‌ను మున్సిపల్‌ ఆఫీస్‌గా మార్చాలనుకున్నారు అధికారులు. అయితే, విపక్షాలు, ప్రజా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేసింది. వివిధ సంఘాల ఆందోళనలు, టీవీ9 వరుస కథనాలతో జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టింది. చివరికి డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయంలోకి తిరుపతి కార్పొరేషన్‌ ఆఫీస్‌ను తరలించాలని నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో డీఎంఅండ్‌ హెచ్‌వో కార్యాలయాన్ని మెటర్నిటీ ఆస్పత్రిలోకి మార్చుతూ ఆదేశాలిచ్చారు అధికారులు. దాంతో మెటర్నిటీ ఆస్పత్రి గ్రౌండ్‌ ఫ్లోర్‌లోకి షిఫ్ట్‌ కానుంది.

కాగా, ప్రస్తుతం ఉన్న మున్సిపల్‌ కార్యాలయం స్థలంలో 82 కోట్ల రూపాయలతో ఐకానిక్‌ బిల్డింగ్‌ నిర్మాణం చేపడుతోంది ప్రభుత్వం. ఈ బిల్డింగ్‌ అందుబాటులోకి రాగానే, మళ్లీ అక్కడికే షిఫ్ట్‌కానుంది కార్పొరేషన్‌ కార్యాలయం. అప్పటి వరకు డీఎంఅండ్‌ హెచ్‌వో ఆఫీస్‌లో కార్యకలాపాలు కొనసాగనున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి