Andhra News: మీ కుటుంబాన్ని బాంబులేసి లేపేస్తాం.. జనసేన కార్యకర్తకు పాకిస్తాన్‌ నుంచి ఫోన్‌ కాల్!

ఆపరేషన్‌ సిందూర్‌ విజయంతో దేశమంతా సంబరాలు జరుపుకొంటున్న వేళ..తిరుమలకు చెందిన ఓ జనసేన కార్యకర్తకు పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్ రావడం కలకలం తీవ్ర రేపింది. తాను పాకిస్తాన్‌ను చెందిన వ్యక్తి నంటూ చెప్పుకొన్న ఓ ఆగంతకుడు ఆ జనసేక కార్యకర్త కుటుంబాన్ని బాంబులేసి లేపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో బెదిరింపు కాల్‌ రావడం స్థానికంగా కలవరపెడుతోంది.

Andhra News: మీ కుటుంబాన్ని బాంబులేసి లేపేస్తాం.. జనసేన కార్యకర్తకు పాకిస్తాన్‌ నుంచి ఫోన్‌ కాల్!
Threat Call

Edited By:

Updated on: May 08, 2025 | 1:11 PM

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రకృతిని ఆస్వాధించేందుకు వెళ్లిన 26 మంది అమాయక పర్యాటకులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. ఈ ఘటన యావత్‌ భారతదేశాన్ని కలచివేసింది.ఈ ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన భారత్.. ఉగ్రవాదులకు తగిన బుద్ది చెప్పేలా.. మే 7వ తేదీ తెల్లవారుజామున ఆపరేషన్ సిందూర్‌ పేరుతో పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. భారత్ దాడిలో 70కిపైగా ఉగ్రవాదులు హతం అయ్యారు.అయితే ఆపరేషన్‌ సిందూర్‌ విజయంతో దేశమంతా సంబరాలు జరుపుకొంటున్న వేళ.. తిరుమలకు చెందిన ఓ జనసేన కార్యకర్తకు పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్ రావడం కలకలం తీవ్ర రేపింది.

పోలీసుల వివరాల ప్రకారం.. తిరుమలలో వ్యాపారం చేసుకుంటూ, జనసేన పార్టీలో కార్యకర్తగా కొనసాగుతున్న త్రిలోక్‌ కుమార్‌కు అనే వ్యక్తికి బుధవారం ఉదయం 10.30 గంటలకు +923292527504 నంబర్‌తో పాకిస్తాన్‌ నుంచి ఓ బెదిరింపు కాల్‌ వచ్చింది. తాను పాకిస్తాన్‌ను చెందిన వ్యక్తి నంటూ చెప్పుకొన్న ఓ ఆగంతకుడు ఆ జనసేక కార్యకర్త కుటుంబాన్ని బాంబులేసి లేపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు.

పాకిస్తాన్ అధికారినని చెప్పిన వ్యక్తి ఫోన్‌లో ఏం మాట్లాడాడు..

త్రిలోక్‌కు ఫోన్‌ చేసి వ్యక్తి హిందీలో మాట్లాడుతూ.. నేను పాకిస్తాన్ అధికారినని.. నీ పేరు త్రిలోక్‌ కుమార్ కదా.. అంటూ ఫ్యామిలీలో మిగతా వాళ్ల పేర్లు కూడా చెప్పినట్టు తెలుస్తోంది. మీరు ఎక్కడుంటారు.. ఏం చేస్తారో అంతా మాకు తెలుసని.. జాగ్రత్తగా ఉండాలని.. నీపై, మీఇంటిపై బాంబులేపి చంపేస్తామని బెదిరించినట్టు తెలుస్తోంది. అయితే త్రిలోక్ కుమార్ ఏ మాత్రం భయపడకుండా.. ఈ విషయాన్ని అలిపిరి పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. 100కు ఫోన్‌ చేసి తనకు వచ్చిన బెదిరింపు కాల్‌ గురించి సమాచారం ఇచ్చారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు అతని దగ్గరకు వచ్చి తనకు వచ్చిన కాల్‌ వివరాలు నెంబర్ తీసుకున్నారు. కాల్‌ ఎవరు చేశారనే దానిపై దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us