TTD: నేడు టీటీడీ పాలక మండలి సమావేశం.. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..

|

Feb 17, 2022 | 6:15 AM

నేడు టీటీడీ(TTD) పాలక మండలి సమావేశం కానుంది. 49 అంశాలతో టీటీడీ అధికారులు ఎజెండా రూపొందించారు.

TTD: నేడు టీటీడీ పాలక మండలి సమావేశం.. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..
Tirumala
Follow us on

నేడు టీటీడీ(TTD) పాలక మండలి సమావేశం కానుంది. 49 అంశాలతో టీటీడీ అధికారులు ఎజెండా రూపొందించారు. ఈ సమావేశంలో టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలోనే పాలక మండలి టీటీడీ బడ్జెట్(Budget) ప్రవేశపెట్టనుంది. శ్రీవేంకటేశ్వర అపన్న హృదయ స్కీమ్ పేరుతో మరో నూతన పథకానికి పాలక మండలి శ్రీకారం చుట్టనుంది. ఈ పథకానికి రూ.లక్ష విరాళమిచ్చిన దాతలకు ప్రివిలేజ్‌గా ఒకసారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించనున్నారు. శ్రీవేంకటేశ్వర అపన్న హృదయ స్కీమ్‌కు ఇచ్చిన విరాళాలను చిన్న పిల్లల ఆపరేషన్ ఖర్చులకు వినియోగించనున్నారు.

తిరుపతిలో నిర్మిస్తున్న శ్రీనివాస సేతు పనులకు నిధులు విడుదలపై ఈ సమావేశంలో బోర్డు చర్చించనుంది. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నదానం కాంప్లెక్స్‌లో సోలార్ స్టీమ్ కుకింగ్ సిస్టమ్ ఏర్పాటుపై పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. తిరుపతిలో చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి నిధులు విడుదలపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. తిరుపతిలో చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి రూ.230 కోట్ల నిధులు కేటాయింపుపై పాలక మండలి సభ్యులు నిర్ణయం తీసుకోనున్నారు.

అలాగే టీటీడీలో కొత్త పీఆర్సీ విధానం అమలులోకి రానుంది. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ మేరకు కామన్ గుడ్ ఫండ్ కింద టీటీడీ రూ.50 కోట్లు చెల్లించనుంది. శ్రీవేంకటేశ్వర ఆయుర్వేద ఫార్మసి అభివృద్ధికి రూ.3.90 కోట్లు కేటాయించనున్నారు. తిరుపతిలో సైన్స్ సిటీ నిర్మాణం కోసం కేటాయించిన భూములను టీటీడీ వెనక్కి తీసుకోనుంది.

Read Also.. Tirumala: శ్రీ‌వారి ఆజ్ఞతోనే అంజ‌నాద్రిలో భూమిపూజ.. వివాదాలు పట్టించుకోకుండా ప్రతి ఒక్కరూ అభివృద్ధికి సహకరించాలని సూచన..