Telugudesam Party in Tirupati: ఆంధ్రప్రదేశ్‌లో దశాబ్దాల కాలం పాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి వరుస పరాజయాలు తప్పడంలేదు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లోనూ ఘోర పరాజయం పాలైంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో సహా ముఖ్యనేతలు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, పార్టీ నేతలంతా కాలికి బలపం కట్టుకుని మరీ ప్రచారం చేశారు. సర్వశక్తులు ఒడ్డినా.. ఓటమి తప్పలేదు.. ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పరాభవం పాలైంది.
తిరుపతి ఎంపీ అకాలమరణంతో ఎర్పడ్డ ఖాళీని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహించింది. దీంతో అందివచ్చిన అవకాశాన్ని చేర్చాకోవద్దని భావించిన టీడీపీ అధికార పార్టీ దూకుడుకు బ్రేక్ వేసి.. కనీసం మెజార్టీని తగ్గించాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరోసారి ప్రతిపక్ష టీడీసీ ఘోర ఓటమి తప్పలేదు.
తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ పై సుమారు 2.72 లక్షల ఓట్ల తేడాతో ఓటమి చెందింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టీడీపీకి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి.. ఇటీవల జరిగిన పంచాయతీ ,మున్సిపల్ ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదురైంది..కొందరు నేతలు పార్టీని వీడటం.. మరికొందరు సైలెంట్ కావడం తో చంద్రబాబు పైనే పూర్తి భారం పడింది. అన్ని తానై వ్యవహరిస్తూ.. వ్యూహ రచన, ప్రచారం చేసినా స్థానిక ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. రెండు సంవత్సరాలు తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఏ మాత్రం కాస్త మెరుగైన ఫలితాలు సాధించలేకపోయింది..
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన ఆ వెంటనే వచ్చిన తిరుపతి ఎన్నికలపై గట్టి ఫోకస్ పెట్టింది. అందరి కంటే ముందే తమ పార్టీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పేరును ఖరారు చేసింది. అన్నిపార్టీ కంటే ముందే ప్రచారం ప్రారంభించింది. ఈసారి ప్రచారంలో విభిన్నంగా చేసింది. ఇంటింటి ప్రచారంపై ఎక్కువగా దృష్టి సారించింది. రాష్ట్రంలో ఉన్న ముఖ్యనేతలను తిరుపతిలో ప్రచార పర్వంలో కి దింపింది. చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ వ్యతిరేకత ,వైఫల్యాలు, హిందూ కార్డు తమకి కలిసి వస్తుందని భావించింది.
అయితే, నైతికంగా తాము గెలిచామని టీడీపీ చెబుతోంది. అధికార వైసీపీ వేవ్ కొనసాగుతోంది. సంక్షేమ పథకాలు ప్రభావం ఉంటుంది. ఐదు లక్షల మెజారిటీ అని చెప్పారు. కానీ, 2.70లక్షల మెజార్టీ మాత్రమే వచ్చిందని. అధికార దుర్వినియోగం, దొంగ ఓట్లు ,ప్రలోభాలతో గెలిచిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ మెజారిటీ ని మూడు లక్షల లోపే కట్టడి చేశామని. ఇంత వేవ్‌లో 3.54 లక్షల ఓట్లు సాధించగలిగామని టీడీపీ చెబుతోంది. వరుస ఓటములు నుంచి టీడీపీ ఎప్పుడు తిరిగి గెలుపు బాట పడుతుంది. పార్టీ అభివృద్ధి ఎలా. పూర్వ వైభవం సాధిస్తుందా.. అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది..
Read Also.. Telangana Municipalities Elections Results 2021 LIVE: తెలంగాణలో మినీ పురపోరు ఫలితాలు.. విజేతలు వీరే..!