Tirumala: శ్రీవారి ఆలయాన్ని దర్శించుకున్న బోండా.. సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు
శ్రీవారి దర్శనానంతరం ఆలయం వెలుపల బోండా ఉమ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో సుపరిపాలన అందాలని శ్రీవారిని ప్రార్థించానని చెప్పారు. అంతేకాదు.. ఏపీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Tirumala: తిరుమల శ్రీవారిని టీడీపీ(TDP) పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswararao) తన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వైసీపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకుని తమ మొక్కలు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల బోండా ఉమ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో సుపరిపాలన అందాలని శ్రీవారిని ప్రార్థించానని చెప్పారు. అంతేకాదు.. ఏపీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఇప్పటి వరకూ ఏ రోజు తన భార్యతో శ్రీవారిని దర్శించుకోలేదని అన్నారు. అసలు సీఎం జగన్ మతం లోపల ఉందని సంచలన ఆరోపించారు. సీఎం.. బయటకు కండువా వేసుకుని తిరుగుతున్నారని అన్నారు.
2014-19 కాలంలో భక్తులు తిరుమలలో అడుగుపెడితే గొప్ప అనుభూతిని పొందేవారు. ఇప్పుడు తిరుమలలో మంచినీళ్లను కూడా బాటిళ్లలో అమ్ముకుంటూ భక్తులను దోచుకోవడం విచిత్రంగా ఉందన్నారు బోండా ఉమ. తిరుమలలో ఇలాంటి పనులు చేస్తే శ్రీవారి ఆగ్రహానికి గురికాక తప్పదని వ్యాఖ్యానించారు. ఇంతటి ఘోరమైన ప్రభుత్వాన్ని చరిత్రలో ఎప్పుడూ చూడలేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో దాడులు నిత్యకృత్యం అయ్యాయి. ప్రతి గంటకూ రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోనే ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్న రాష్ట్రం ఏపీనేనని నేషనల్ బ్యూరో ఆఫ్ క్రైం చెబుతోంది.. ఎప్పుడూలేని దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారులు ఎందుకు జరుగుతున్నాయో వైసీపీ ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు బోండా ఉమామహేశ్వరరావు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..