TDP – Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిధిగృహం వద్ద బాబుకు టీటీడీ రిసెప్షన్ డిప్యూటీ ఈవో లోకనాధం స్వాగతం పలికారు. శ్రీవారిని బాబు దర్శించుకున్నారు. దర్శనాంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని శ్రీవారిని ప్రార్థించానని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. అమరావతి వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. శుక్రవారం అమరావతితోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రికరణతో ఏపీలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మూడు రాజధానులతో అభివృద్ధి జరగదని, ఇలాంటి మాయమాటలతో రాష్ట్రం నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాజధాని 5 కోట్ల ప్రజల సమస్య అని, ఏపీ ప్రజల భావితరాల భవిష్యత్ కోసం ఒకే రాజధాని ఉండాలన్నారు. ఏపీని అన్ని విధాలా రక్షించాలని శ్రీవారిని ప్రార్థించానని చంద్రబాబు తెలిపారు. దర్శనాంతరం తిరుపతిలో జరుగుతున్న అమరావతి పరిరక్షణ సభకు టీడీపీ అధినేత వెళ్ళనున్నారు.
తిరుచానూరులో అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ కొనసాగుతోంది. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో..45 రోజులు చేపట్టిన పాదయాత్రకు ముగింపుగా ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. రైతులకు ఇప్పటికే పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి. టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, వామపక్ష నేతలు హాజరయ్యారు. ఒకే రాష్ట్రం..ఒకే రాజధాని నినాదం పేరుతో 2 సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నారు అమరావతి ప్రాతం రైతులు.
ఇవి కూడా చదవండి: అక్కడ పొరపాటున కూడా నవ్వొద్దు, మద్యం తాగొద్దు.. గీత దాటారో అంతే సంగతి..