వేసవి సందర్భంగా శుభకార్యాలు, స్వగ్రామాలకు వెళ్లే వారితో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల ఇబ్బందులు గమనించిన దక్షిణ మధ్య రైల్వే ఎప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ – తిరుపతి, తిరుపతి – కర్నూలు మధ్య స్పెషల్ ట్రైన్స్ నడిపిస్తున్నారు. ఈ రైళ్లు మే మూడు నుంచి ఐదో తేదీల మధ్య సేవలు అందిస్తాయి. ప్రయాణికులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. 07433 నంబర్ గల రైలు మే మూడో తేదీన హైదరాబాద్ లో సాయంత్రం 6-40 నిమిషాలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7-50 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. 07434 నంబర్ గల రైలు మే ఐదో తేదీన తిరుపతిలో రాత్రి 20-25 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8-30 గంటలకు హైదరాబాద్ చేరుకుటుంది. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.
07435 నంబర్ గల రైలు మే నాలుగో తేదీన కర్నూలు సిటీలో సాయంత్రం 04-15కు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 04-00 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. 07436 నంబర్ గల రైలు మే మూడో తేదీన తిరుపతితో ఉదయం 7-30 గంటలకు బయల్దేరి అదే రోజు సాయంత్రం 6-40 గంటలకు కర్నూలు సిటీ చేరుకుంటుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి.
Viral: అమెరికా నుంచి వచ్చిన పార్శిల్ చెక్ చేసిన అధికారులు.. లోపల కనిపించింది చూసి షాక్
Amit Shah: కామ్‌గా కనిపించే అమిత్ షా చేతికి గన్ వస్తే..!టార్గెట్ ఫిక్స్ చేసిన షా..!