Tirupati: పోలీస్ స్టేషన్ మరుగుదొడ్డిలో గుర్తు తెలియని మృతదేహం.. దుర్వాసన రావడంతో గమనించి..

Tirupati District: పుత్తూరు అర్బన్ పీఎస్ ఆవరణలో ఉన్న మరుగుదొడ్డిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించింది. పోలీసు స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులు, సందర్శకుల కోసం నిర్మించిన మరుగుదొడ్డి నుంచి దుర్వాసన రావడంతో..

Tirupati: పోలీస్ స్టేషన్ మరుగుదొడ్డిలో గుర్తు తెలియని మృతదేహం.. దుర్వాసన రావడంతో గమనించి..
Puttur Police Station

Edited By:

Updated on: Jul 24, 2023 | 2:02 PM

తిరుపతి జిల్లా న్యూస్, జూలై 24: పుత్తూరు అర్బన్ పీఎస్ ఆవరణలో ఉన్న మరుగుదొడ్డిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించింది. పోలీసు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులు, సందర్శకుల కోసం నిర్మించిన మరుగుదొడ్డి నుంచి దుర్వాసన రావడంతో పోలీసులు డెడ్ బాడీని గుర్తించారు. మరుగుదొడ్డి తలుపు పగుల గొట్టి తెరిచి చూస్తే మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు శరీరం బాగా కుళ్ళిపోయినట్లు గుర్తించారు. చనిపోయి 2 లేదా 3 రోజులై ఉండవచ్చని భావిస్తున్న పోలీసులు
ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మృతి చెందిన వ్యక్తికి సుమారు 45 ఏళ్ల వయసు ఉండవచ్చని భావిస్తున్నారు. విఆర్ఒ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు తహశీల్దారుకు సమాచారం ఇచ్చి పంచనామా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన వ్యక్తినా లేక ఇతరులెవరైనా మృతి చెంది ఉంటారా అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే డెడ్ బాడీ లభించడం కలకలం రేపగా, డెడ్ బాడీ ఎవరిదన్న దానిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. 

Loading...
Unable to load recommendations.
Follow Us