Tirumala: ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం జగన్‌కు అధికారం శాశ్వతంగా ఉండాలంటున్న ఎమ్మెల్యే

MLA Roja At TML: చిత్తూరు జిల్లా(Chittoor District) నగరి(Ngari) ఎమ్మెల్యే రోజా ఆలయాల బాట పట్టారు. తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ ఆలయాల దర్శించుకుంటున్నారు. యదాద్రి లక్ష్మీనరసింహ స్వామి, కాణిపాకం..

Tirumala: ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం జగన్‌కు అధికారం శాశ్వతంగా ఉండాలంటున్న ఎమ్మెల్యే
Roja At Tml

Updated on: Apr 02, 2022 | 12:42 PM

MLA Roja At TML: చిత్తూరు జిల్లా(Chittoor District) నగరి(Ngari) ఎమ్మెల్యే రోజా ఆలయాల బాట పట్టారు. తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ ఆలయాల దర్శించుకుంటున్నారు. యదాద్రి లక్ష్మీనరసింహ స్వామి, కాణిపాకం వినాయకుడిని దర్శించుకుని పూజలు చేసిన రోజా.. ఉగాది పర్వదినం రోజున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తెలుగు ప్రజలందరికీ శుభకృత్ నామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలను చెప్పారు.  ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. 42 ఏళ్ల తర్వాత జిల్లాల విభజనపై సీఎం జగన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.  ప్రజల జీవితాల్లో వెలుగు నిపుతున్న సీఎం జగన్ కు శాశ్వత అధికారం ఉండాలని తాను స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు రోజా. అంతేకాదు సీఎం జగన్ మూడు రాజధానుల సంకల్పానికి దేవుడు ఆశీస్సులు ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు.

 

Also Read: Pushpa Song: సామీ సామీ సాంగ్‌కు యుఎస్ అమ్మాయిలు డ్యాన్స్.. నెట్టింట్లో వీడియో వైరల్

Ugadi Celebrations: తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఉగాది వేడుకలు.. పాల్గొన్న సీఎం దంపతులు