Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. వామ్మో.. మళ్లీ చిరుత వచ్చింది.. వీడియో

|

Sep 29, 2024 | 8:39 AM

తిరుమలలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. రాత్రి శ్రీవారి మెట్టు మార్గంలో కంట్రోల్ రూమ్‌ దగ్గర చిరుత కనిపించింది. చిరుతపులిని గమనించిన సెక్యూరిటీ గార్డ్‌ భయంతో కంట్రోల్‌రూమ్‌లోకి వెళ్లాడు. వెంటనేే అటవీశాఖ అధికారులకు, టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చాడు.

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. వామ్మో.. మళ్లీ చిరుత వచ్చింది.. వీడియో
Leopard
Follow us on

తిరుమలలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. రాత్రి శ్రీవారి మెట్టు మార్గంలో కంట్రోల్ రూమ్‌ దగ్గర చిరుత కనిపించింది. చిరుతపులిని గమనించిన సెక్యూరిటీ గార్డ్‌ భయంతో కంట్రోల్‌రూమ్‌లోకి వెళ్లాడు. వెంటనేే అటవీశాఖ అధికారులకు, టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. చిరుత సంచారంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది చిరుత జాడ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా.. జాగ్రత్తగా ఉండాలంటూ భక్తులకు సూచనలు చేస్తున్నారు. గుంపులు గుంపులుగా వెళ్లాలంటూ సూచిస్తున్నారు.

గత ఏడాది ఆగస్టులో అలిపిరి మార్గంలో చిన్నారిని చంపేసింది ఓ చిరుత. అప్పుడు ఆరుచిరుతలను బంధించి జూపార్క్‌కు తరలించారు అధికారులు. తాజాగా శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచరించడంతో భక్తులు, అధికారులు టెన్షన్‌ పడుతున్నారు. చిరుత సంచారం నేపథ్యంలో ఇప్పటికే అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు భక్తులకు ఎటువంటి అపాయం జరగకుండా చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

వీడియో చూడండి..

 

చిరుత.. ఈ మాట వింటేనే శ్రీవారి భక్తులు వణికిపోతున్నారు. సరిగ్గా ఏడాది క్రితం కూడా చిరుత అటు భక్తులు, ఇటు టీటీడీకి ముచ్చెమటలు పట్టించాయి. గతంలో అలిపిరి కాలిబాట మార్గంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సమీపంలో కొన్ని చిరుతపులులను అటవీశాఖ అధికారులు బంధించారు. తల్లిదండ్రులతో కలిసి స్వామి వారి దర్శనానికి వెళ్తున్న ఓ బాలుడిపై దాడి చేశాయి. ఓ సందర్భంలో చిన్నారిని లాక్కెళ్లి తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. దీంతో తిరుమలలో భక్తులు గుంపులుగా వెళ్లాలని టీటీడీ సూచించింది. భక్తులకు మనోధైర్యం పెంచేందుకు కర్రలను సైతం అందించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..