Tirumala Video: శ్రీవారిని దర్శించుకున్న వెంకయ్య నాయుడు… వీఐపీలకు మాజీ ఉపరాష్ట్రపతి కీలక సూచనలు

స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల ప్రపంచంలోని హిందువులందరికీ స్ఫూర్తి కేంద్రంగా అభివర్ణించారు. భక్తులు సమర్పించే కానుకలు ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు...

Tirumala Video: శ్రీవారిని దర్శించుకున్న వెంకయ్య నాయుడు... వీఐపీలకు మాజీ ఉపరాష్ట్రపతి కీలక సూచనలు
Venakaiah Naidu Tirumala Da

Updated on: Jul 28, 2025 | 11:45 AM

స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల ప్రపంచంలోని హిందువులందరికీ స్ఫూర్తి కేంద్రంగా అభివర్ణించారు. భక్తులు సమర్పించే కానుకలు ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రధానంగా ఖర్చు చేయాలని వెంకయ్య సూచించారు. ఆలయ నిధుల విషయంలో ప్రభుత్వాలు రాజకీయ జోక్యం చేసుకోకూడదన్నారు. భక్తులు సమర్పించే కానుకలు ఇతర కార్యక్రమాలకు మళ్లించవద్దని సూచనలు చేశారు.

ప్రతి ఊరిలో గుడి ఉండాలి. గుడి, బడి లేని ఊరు ఉండకూడదన్నారు వెంకయ్య నాయుడు. వీఐపీలు ఏడాదికోసారి మాత్రమే తిరుమల దర్శనానికి రావాలని సూచించారు. ఏడాదికి ఒకసారి దర్శనానికి వచ్చే పద్ధతిని ప్రజాప్రతినిధులు పాటించాలన్నారు. వీఐపీలను పరిమితం చేస్తే సామాన్య భక్తులకు ఇబ్బంది ఉండదుని అన్నారు. తిరుమలకు వచ్చే ప్రజాప్రతినిధులు మరింత బాధ్యతగా, హుందాగా వ్యవహరించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు.

 

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అన్న ప్రసాదాన్ని స్వీకరించడం ఆనందదాయకంగా ఉందని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. అన్నప్రసాదాన్ని చాలా చక్కని రుచితో పాటు శుచిగా చేస్తున్నారని ప్రశంసించారు. నిత్యం వేలాది మంది భక్తులకు స్వామివారి అన్నప్రసాదం అందజేస్తున్నఈ కేంద్రం నిర్వహణా బృందానికి అభినందనలు తెలిపారు. ఈ స్పూర్తిని అన్ని ఆలయాలు ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు వెంకయ్య నాయుడు.

వీడియో చూడండి: