Elephants : చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో తిష్టవేసిన 14 ఏనుగుల గుంపు.. మామిడి, బొప్పాయి తోటల ధ్వసం, స్థానికుల ఆందోళన

|

May 18, 2021 | 4:28 PM

Elephants attack : చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం బోయపల్లి ప్రాంతంలో ఏనుగుల సంచారం స్థానికుల్ని బెంబేలెత్తిస్తోంది...

Elephants : చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో తిష్టవేసిన 14 ఏనుగుల గుంపు.. మామిడి, బొప్పాయి తోటల ధ్వసం, స్థానికుల ఆందోళన
Elephants
Follow us on

Elephants attack : చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం బోయపల్లి ప్రాంతంలో ఏనుగుల సంచారం స్థానికుల్ని బెంబేలెత్తిస్తోంది. తుమ్మెద పాలెం అటవీ ప్రాంతంలో 14 ఏనుగుల గుంపు నాలుగు రోజులుగా తిష్ట వేసింది. కట్టకిందపల్లి, బోయపల్లి గ్రామాలకు చెందిన పంట పొలాలపైకి వచ్చి మామిడి, బొప్పాయి తోటల్ని గజరాజులు నాశనం చేస్తున్నాయి. దీంతో ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరిమికొట్టేందుకు గ్రామస్తులు, అటవీశాఖ సిబ్బంది బాణాసంచా కాల్చుతున్నారు. కాగా, ఏనుగుల మంద‌లు అప్పుడ‌ప్పుడు అడ‌వుల నుంచి దారిత‌ప్పి స‌మీప గ్రామంలో ప్ర‌వేశిస్తుంటాయి. ఇలా ఏనుగుల మంద‌ గ్రామంలో ప్ర‌వేశించిందంటే చాలు ఊరుఊరంతా గ‌జగ‌జా వ‌ణికిపోతుంది. ఏనుగులు చేసే బీభ‌త్సం అంత దారుణంగా ఉంటుంది మ‌రి. వంద‌ల ఎక‌రాల పంట‌ను క్ష‌ణాల్లో ధ్వంసం చేస్తాయి. ఇలాఉండగా, చిత్తూరు జిల్లాకు పక్కనున్న త‌మిళనాడు రాష్ట్రం ఈరోడ్ జిల్లాలోని స‌త్య‌మంగ‌ళ ప‌ట్ట‌ణ శివార్ల‌లో ఇటీవ‌ల స‌మీప అడ‌వుల్లోంచి దారిత‌ప్పి వ‌చ్చిన ఓ ఏనుగుల గుంపు అర‌టి తోట‌పై దాడి చేసింది. తోట‌లోని 300కు పైగా అర‌టిచెట్ల‌ను ఏనుగులు తొక్కేశాయి.

Read also : Modi : ఇప్పటి పరిస్థితులు.. భవిష్యత్‌లో మరిన్ని క్లిష్టమైన సమస్యలను సమర్థంగా ఎదుర్కోడానికి దోహదపడతాయి : ప్రధాని మోదీ