Tirumala: పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో లోపం బయటపడింది. అలిపిరి చెకింగ్ పాయింట్ దాటుకుని నాగాలాండ్‌కు చెందిన భక్తులు కారులో మద్యం బాటిళ్లు తీసుకెళ్లారు. ఘాట్ రోడ్డులో మద్యం సేవిస్తున్నారని సమాచారం అందడంతో విజిలెన్స్ సిబ్బంది చేరుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తిరుమలలో మద్య నిషేధం ఉందని తమకు తెలియదని నాగాలాండ్ భక్తులు చెప్పడం గమనార్హం. తెలియకుండా తప్పుచేశామని, క్షమించాలని భక్తులు వేడుకున్నట్లు తెలుస్తోంది.
కాగా, తాజాగా తిరుమలలో మరోసారి మద్యం బాటిల్స్ కలకలం రేపాయి. కొందరు భక్తులు విజిలెన్స్ సిబ్బంది కళ్లుగప్పి మద్యం తీసుకువస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలో ఎన్నో జరిగాయి. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో మద్యం తాగడం అనేది ఎప్పటి నుంచో నిషేధం ఉన్న కొందరు గుట్టు చప్పుడు కాకుండా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు.