Tirupati: మే 5న తిరుపతిలో పర్యటించనున్న సీఎం జగన్.. చిన్నపిల్లల మ‌ల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన

Tirupati: హిందువుల ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంలో తిరుపతి.. మెడికల్ హబ్ గా మారేందుకు రెడీ అవుతోంది. చిన్నపిల్లల‌కు అధునాతన మెరుగైన వైద్యం అందించేందుకు టిటిడి(TTD) ఆధ్వర్యంలో..

Tirupati: మే 5న తిరుపతిలో పర్యటించనున్న సీఎం జగన్.. చిన్నపిల్లల మ‌ల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన
Cm Jagan Tirupati Tour
Follow us
Surya Kala

|

Updated on: Apr 29, 2022 | 9:23 PM

Tirupati: హిందువుల ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంలో తిరుపతి.. మెడికల్ హబ్ గా మారేందుకు రెడీ అవుతోంది. చిన్నపిల్లల‌కు అధునాతన మెరుగైన వైద్యం అందించేందుకు టిటిడి(TTD) ఆధ్వర్యంలో చిన్నపిల్లల మ‌ల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నది. ఈ నేపథ్యంలో మే 5 వ తేదీన తిరుమల తిరుపతిలో సీఎం జగన్సు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్తాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సుమారు రూ.240 కోట్ల వ్యయంతో నిర్మించనున్న చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని  మే 5న ముఖ్యమంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి శంకుస్థాపన చేయ‌నున్నారు. ఇదే విషయాన్నీ టిటిడి చైర్మన్  అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. అంతేకాదు శుక్రవారం సాయంత్రం ఛైర్మన్ చిన్నపిల్లల మ‌ల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి స్థలాన్ని, టాటా క్యాన్సర్ ఆసుప‌త్రిని వైవీ సుబ్బారెడ్డి ప‌రిశీలించారు. ఆయన వెంట  తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో వీర‌బ్రహ్మం కూడా ఉన్నారు.  ముఖ్యమంత్రి ప‌ర్యట‌న సంద‌ర్భంగా చేప‌ట్టాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారుల‌తో సుబ్బారెడ్డి చ‌ర్చించారు.

ఈ సంద‌ర్భంగా టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆదేశాల మేర‌కు చిన్నపిల్లల కోసం బ‌ర్డ్ ఆసుప‌త్రి ప్రాంగణంలో తాత్కాలికంగా శ్రీ ప‌ద్మావ‌తి హృద‌యాల‌య‌ను ప్రారంభించామ‌ని చెప్పారు. అయితే చిన్నపిల్లల‌కు అన్నిర‌కాల వైద్యసేవ‌లు అందించేందుకు వీలుగా మ‌ల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అధునాతన సౌకర్యాలతో త్వరలో నిరించనున్నామని అన్నారు. గత ఆరు నెల‌ల వ్యవ‌ధిలో 300 గుండె ఆప‌రేష‌న్లు చేసి 300 మంది చిన్నారుల ప్రాణాల‌ను కాపాడామ‌ని తెలిపారు. సీఎం టాటా ట్రస్టు నిర్మించిన శ్రీ వేంక‌టేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ రీసెర్చి ఆసుప‌త్రిని ముఖ్యమంత్రి ప్రారంభిస్తార‌ని వెల్లడించారు. అదేవిధంగా, బ‌ర్డ్‌లో స్మైల్ ట్రైన్ వార్డును, మొద‌టి విడ‌తలో పూర్తయిన శ్రీ‌నివాస సేతును సిఎం ప్రారంభిస్తార‌ని సుబ్బారెడ్డి వివ‌రించారు.

Also Read:

Solar Eclipse 2022: శనివారం ఏర్పడనున్న సూర్యగ్రహణం.. ఈ రాశివారికి అనేక ప్రయోజనాలు తెలుస్తోందట.. అందులో మీరున్నారా

Viral Video: టీచర్‌కు డ్యాన్స్ నేర్పే గురువుగా మారిన విద్యార్థి.. క్లాస్ రూమ్‌లో టీచర్ స్టూడెంట్స్ సందడే సందడి