ప్రస్తుతం తిరుపతి జిల్లా అంతటా గంగమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఈ ఉత్సవాలు నిర్వహించలేదు. అయితే ఈఏడాది మాత్రం అంగరంగవైభవంగా గంగ జాతరను నిర్వహిస్తున్నారు. వారం రోజులపాటు కొనసాగే ఈ ఉత్సవాల్లో భాగంగా రకరకాల వేషధారణలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. రోజుకో వేషంలో అమ్మవారిని దర్శించుకుంటారు. తాజాగా భాకరా పేట సీఐ తులసిరామ్ గంగమ్మ జాతరలో కత్తి పట్టారు. సొంత గ్రామం కార్వేటినగరం గంగమ్మ జాతరకు వచ్చిన ఆయన స్థానికులతో కలిసి కత్తి పట్టి చిందులేశాడు. డప్పుల దరువులకు తగ్గట్టుగా కత్తిని అటు ఇటూ తిప్పుతూ అదరగొట్టాడు.
అయితే సీఐ సాధారణ దుస్తుల్లో ఇలా చేసి ఉంటే ఏమయ్యేది కాదు. ఎటొచ్చి సీఐ యూనిఫాంలో కత్తి పట్టి డ్యాన్స్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా గంగమ్మ జాతర ఉత్సవాల సందర్భంగా తిరుపతి లోక్ సభ సభ్యుడు డాక్టర్ మద్దెల గురుమూర్తి ఇటీవల వేంకటేశ్వర స్వామి వేషధారణతో అమ్మవారి మొక్కులు తీర్చుకున్న సంగతి తెలిసిందే.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: