AP Minister apology : ఏపీ మంత్రి గారు సారీ చెప్పారు. నిన్న మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకుంటున్నా.. క్షమించండని తిరుపతిలో వేడుకున్నారు

|

Mar 28, 2021 | 7:39 PM

AP Minister Sri Ranganatha raju apology : ఇదండీ సంగతి. నోరు జారనేల.. సారీ చెప్పనేల. అదేమంటే నేనూ రైతు బిడ్డనే అన్నారు మంత్రి శ్రీరంగనాథ రాజు. వరి పండించడం సోమరి వ్యవసాయం అంటూ నిన్న

AP Minister apology : ఏపీ మంత్రి గారు సారీ చెప్పారు. నిన్న మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకుంటున్నా.. క్షమించండని తిరుపతిలో వేడుకున్నారు
Ap Minister Sriranganathara
Follow us on

AP Minister Sri Ranganatha raju apology : ఇదండీ సంగతి. నోరు జారనేల.. సారీ చెప్పనేల. అదేమంటే నేనూ రైతు బిడ్డనే అన్నారు మంత్రి శ్రీరంగనాథ రాజు. వరి పండించడం సోమరి వ్యవసాయం అంటూ నిన్న కామెంట్ చేశారాయన. పనీపాటా లేనివాళ్లు, కష్టపడటానికి ఇష్టం లేనివాళ్లే వరి వేస్తారని చెప్పుకొచ్చారు. దానిపై వివాదం చెలరేగింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి.. ఇలా మాట్లాడ్డం ఏమిటనే ప్రశ్నలు వెల్లువెత్తాయి. దీంతో.. ఇవాళ తిరుపతిలో పర్యటించిన మంత్రి శ్రీరంగరాజు.. తన మాటలకు పశ్చాత్తాప్పడ్డారు. బేషరతుగా క్షణాపణలు చెప్పారు. రైతులకు క్షమాపణలు చెబుతూ తన మాటల్ని వెనక్కితీసుకుంటున్నానని బహిరంగంగా ప్రకటించారు.

ఇవాళ తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంత్రి రంగనాథ రాజు మీడియా సమావేశంలో రైతులను ఈ క్షమాపణలు కోరారు. మా ప్రాంతమంతా ఎక్కువగా వరి వ్యవసాయం చేస్తారని, అయితే, ప్రభుత్వం తెస్తున్న కార్యక్రమాలు కౌలు రైతులకు అందటం లేదన్న ఉద్దేశ్యంలోనే తాను నిన్న ఆ విధంగా మాట్లాడానని శ్రీరంగనాథరాజు చెప్పుకొచ్చారు. అంతేకాని..  రైతులను కించపరచాలన్న ఉద్దేశ్యం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. తాను రైతు బిడ్డను కావటంతో తొందరపాటులో అలా మాట్లాడానన్నారు. తన ప్రకటనకు రైతులు ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమాపణలు చెబుతున్నాను.. రైతు సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నాను. అని సమాధానపడ్డారు మంత్రివర్యులు.

Read also : VH on HCA : ‘హెచ్ సి ఎ’ అవినీతితో భ్రష్టు పట్టింది.. స్టేడియంలు లేవు.. జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి ధ్యాసే లేదు : మీటింగ్ నుంచి వైదొలుగుతూ వీహెచ్‌