తిరుపతి, ఆగస్టు 25: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుల పేర్లను ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం ప్రకటించిన ఈ లిస్టులో మొత్తం 24 మందికి బోర్డు మెంబర్లుగా అవకాశం దక్కిండి. ఈ క్రమంలో టీటీడీ పాలకమండలి సభ్యులుగా ఎమ్మెల్యే కోటాలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన సామినేని ఉదయభాను (జగ్గయ్య పేట నియోజకవర్గం), పొన్నాడ సతీష్ కుమార్ (ముమ్మిడివరం), తిప్పేస్వామి (మడకశిర)కి అవకాశం అభించింది. అలాగే ఈ లిస్టులో కడప నుంచి మాసీమా బాబు, యానాదాయ్య, ప్రకాశం జిల్లా నుంచి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు కుమారుడు శిద్ధా సుధీర్,గోదావరి జిల్లా నుంచి గడిరాజు వెంకట సుబ్బరాజు, నాగ సత్యం యాదవ్(ఏలూరు), కర్నూలు నుంచి సీతారామిరెడ్డి పేర్లు కూడా ఉన్నాయి. ఇంకా అశ్వత్థ నాయక్, నాగసత్యం యాదవ్ సహా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు చెందినవారికి కూడా టీటీడీ మెంబర్లుగా అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు జగన్ ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులను జారీ చేసింది.
ఇదిలా ఉండగా.. టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నియమించిన విషయం తెలిసిందే. తాజాగా 24 మందితో కూడిన టీటీడీ పాలకమండలి సభ్యుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఇంకా దీనిపై ప్రభుత్వం జీవోను విడుదల చేయడమే మిగిలి ఉంది.
#TTD తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల జాబితా విడుదలైంది. 24 మంది సభ్యులతో కూడిన జాబితాను టీటీడీ విడుదల చేసింది. తెలంగాణ నుంచి గడ్డం సీతా ఎంపీ @DrRanjithReddy సతీమణి కు టీటీడీ బోర్డులో చోటు దక్కింది 💐 pic.twitter.com/HpJ1laK0ey
— Amberpet Anil Goud (@AnilGoudKTR) August 25, 2023
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.