Tirumala News: ఎస్వీబీసీ ఛానల్‌లో సినీ సాంగ్స్.. టీటీడీ తీరుపై మండిపడిన సోము వీర్రాజు

Tirumala News: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఎస్వీబీసీ ఛానల్‌లో(SVBC Channel) సుమారు అరగంట సేపు సినిమా పాటలు ప్రసరమయ్యాయి. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు..

Tirumala News: ఎస్వీబీసీ ఛానల్‌లో సినీ సాంగ్స్.. టీటీడీ తీరుపై మండిపడిన సోము వీర్రాజు
Somu Verraju

Updated on: Apr 23, 2022 | 1:23 PM

Tirumala News: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఎస్వీబీసీ ఛానల్‌లో(SVBC Channel) సుమారు అరగంట సేపు సినిమా పాటలు ప్రసరమయ్యాయి. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తిరుపతిలో స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై  సోము వీర్రాజు మండిప‌డ్డారు. ఎస్వీబీసీ ఛానల్‌లో సినిమా పాటలు ప్రసారమవ్వడమేమిటంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఛానల్‌ నిర్వహణ బాధ్యత‌లు రాజకీయ నాయకుల చేతుల్లో ఉండ‌డం ఎందుకు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

గత కొంతకాలంగా తిరుమల క్షేత్రంలోని భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. అసలు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు వసతులు కల్పించాల్సిన బాధ్యత టీటీడీ దేన‌ని అన్నారు. తిరుమలకు సంబంధించి ముఖ్యమైన‌ నిర్ణయాలు తీసుకునే ముందు అందరితో చర్చించాలని సూచించారు. ధర్మ ప్రచారానికి టీటీడీ బడ్జెట్‌లో ఎంత కేటాయిస్తున్నారో చెప్పాల‌ని వీర్రాజు డిమాండ్ధ చేశారు.

తిరుమల క్షేత్రం పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఒక్క టీటీడీది మాత్రమే కాదని.. ప్రభుత్వానికి కూడా ఉందని అన్నారు. అసలు టీటీడీ నిర్వహించే ధర్మ ప్రచార కార్యక్రమాలు పూర్తిగా ఆగిపోయాయని..  ధర్మప్రచార నిధులు ఎస్వీబీసీ ఛానల్‌కు 80శాతం కేటాయిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వేద పాఠశాలను టీటీడీ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఏపీలో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నిస్తే.. వారిపై ప్రభుతం అక్రమంగా కేసులు పెడుతుందని.. ప్రభుత్వం తీరు సరికాదని అన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

Bottle Gourd: సమ్మర్‌లో సొరకాయతో బోలెడన్ని ప్రయోజనాలు.. ఆ సమస్యలకు చెక్..

Hyderabad: గుడిలో మర్డర్.. అయ్యగారు.. ఆశీర్వదిస్తాడనుకుంటే.. అంతం చేశాడు..